Marriage Gifts : మనం ఎప్పుడైనా ఏదైనా పెళ్లికి కానీ ఇతర శుభకార్యాలకు కానీ వెళ్ళినప్పుడు కట్నాలు చదివించడమో లేదా చదివిస్తుంటే చూడడమో చేసే ఉంటాం. అక్కడ కొంతమంది డబ్బు రూపంలో ఇస్తే, మరికొంత వస్తువుల రూపంలో గిఫ్ట్స్ ఇస్తుంటారు. ఎవరి స్థాయికి తగినంతగా వారు డబ్బులో, వస్తువులో ఇస్తుంటారు. అయితే పెళ్ళిలో కానీ ఇతర ఫంక్షన్స్ లో కానీ ఈ చదివింపులు ఎందుకు ఇస్తారో చాలామందికి తెలీదు.
అసలు ఇది ఎప్పుడు మొదలైందో, ఎందుకు మొదలైందో ఇప్పుడు చూద్దాం.. పూర్వం ఒకరింట్లో కూతురి పెళ్ళి జరుగుతుంది అంటే.. చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు 100 లేదా 50 రూపాయలు ఎవరికి తోచినంత వాళ్ళు చదివింపులుగా ఇచ్చే వారు. చివరకు ఆ డబ్బు అమ్మాయికి కాకుండా కన్యాదాతకు వెళ్ళేది. ఆ డబ్బు ఆ కుటుంబానికి పెళ్లి ఖర్చులు సర్దుకునేది. ఆ విధంగా పెళ్ళిళ్ళల్లో, ఇతర శుభకార్యాలల్లో కట్నాలు ఇవ్వడం అనేది మొదలైంది.
వీటిని తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఈడేతలు అంటారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో కట్నాలు అంటే ఇంకొన్ని ప్రాంతాల్లో చదివింపులు అంటారు. ప్రస్తుతం చాలామంది ఏదో ఒక వస్తు రూపంలో, లేదంటే గిఫ్ట్ ల రూపంలో చదివింపులు ఇస్తున్నారు. ఒకప్పుడు పెళ్లిళ్లకే పరిమితమైన ఈ కట్నాలు ఆ తర్వాత ఇతర శుభకార్యాలకు కూడా పాకాయి.