Mobile Tips : వర్షాకాలంలో బయటికి వెళ్లాలంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. కానీ వెళ్ళక తప్పదు. ఆ ఇబ్బందులలో ముఖ్యంగా వర్షంలో బయటకు వెళ్ళినప్పుడు మన మొబైల్ తడిసిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోవడం. మొబైల్ లేనిది మనం అడుగు కూడా బయట పెట్టలేము. మరి వర్షం నుండి మొబైల్ ని ఎంత కాపాడినా కూడా ఒక్కోసారి తడిచిపోతుంది. అలా మొబైల్ తడిచినప్పుడు ఏం చేయాలి.. పాడవకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసుకుందాం..
కొంతమంది టెక్ నిపుణుల అభిప్రాయం ప్రకారం మొబైల్ తడిసిన వెంటనే స్విచ్ ఆఫ్ చేయాలి. లేకపోతే మొబైల్ లో షార్ట్ సర్క్యూట్ అయ్యి పేలిపోయే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. వర్షంలో అనుకోకుండా మొబైల్ తడిచి పోయినప్పుడు వెంటనే స్విచ్ ఆఫ్ చేసి దాంట్లో ఉన్నటువంటి సిమ్, బ్యాటరీ, మెమరీ కార్డ్ అన్నింటిని బయటకు తీసి పొడి క్లాత్ తో అన్నిటిని తడిపోయేలాగా తుడవాలి.
కొన్ని ఫోన్లకు బ్యాటరీ తీయడానికి వీలు లేకుండా ఉంటుంది. అలాంటి ఫోన్లను తడి అంతా పోయేలాగా తుడిచి ఆరబెట్టాలి. వర్షంలో తడిసిన వెంటనే మాత్రం మొబైల్ ని అసలు వాడకూడదు. నీటి చుక్కలు లోపలే ఉండడంవల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది. కనీసం నాలుగు గంటలు పాటు బియ్యంలో మొబైల్ ఉంచడం చాలా మంచిది. అయితే బియ్యంలో ఉంచడం వల్ల బియ్యం మొబైల్ లోని తేమను పీల్చుకుంటాయి.
మొబైల్ పూర్తిగా ఆరిపోయింది అనిపించిన తర్వాతనే వాడడం ఉత్తమం. అనుమానంగా ఉన్నప్పుడు మొబైల్ కి హెడ్ ఫోన్స్ పెట్టి వాడడం గాని, చార్జింగ్ పెట్టడం లాంటి పనులు మాత్రం చేయకూడదు. ఇలా చేయడం వల్ల మొబైల్ పైన నీటి బిందువుల ఆనవాళ్లు అలాగే ఉండిపోతాయి. వర్షాకాలం రాబోతుందంటేనే ముందు జాగ్రత్తగా మొబైల్ ని కాపాడుకోవడం కోసం మార్కెట్లో ఇప్పుడు ఎన్నో రకాల ప్యాచెస్ దొరుకుతున్నాయి.వాటిల్లో జీప్ ఉన్న వాటిని ఎంచుకొని మొబైల్ ని అందులో పెట్టి దాచేయడమే.