New Clothes : కొత్త బట్టలు అంటే అందరికీ ఇష్టంగా ఉంటుంది. ఎప్పుడెప్పుడు వాటిని వేసుకుంటామని ఎదురు చూస్తూ ఉంటారు. అయితే కొత్త బట్టలు కొనగానే నేరుగా వాటిని అలాగే ధరించవచ్చా..? అలా వేసుకుంటే ఏమైనా సమస్యలు తలెత్తుతాయా..? కొత్త బట్టలు కొనగానే వెంటనే వాటిని ధరిస్తే ఆరోగ్య సమస్యలు వస్తాయి. సాధారణంగా అందరూ కొత్త బట్టలు కొనగానే వాటిని వాష్ చేయకుండానే వెంటనే వేసేసుకుంటారు. అలా వేసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు వ్యాధులు వస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇప్పుడు బట్టలను ఎక్కువగా ఆన్లైన్లో బుక్ చేసుకోవడం చాలా మందికి అలవాటైపోయింది. అలా ఆన్లైన్లో బుక్ చేసినప్పుడు బట్టలు సరిగ్గా సరిపోకపోతే వాటిని వేసుకొని చూసిన తర్వాత రిటర్న్ చేస్తారు. షాపులలో బట్టలు కొన్నప్పుడు ట్రయల్ రూమ్ లో బట్టలు వేసుకొని చూసి అలాగే కింద పడవేస్తూ ఉంటారు. తిరిగి షాపు యాజమాన్యం వాటిని నీట్ గా ప్యాక్ చేసి అమ్ముతూ ఉంటారు. ఇలా వాటిని ధరించినప్పుడు చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు సోకుతాయి.
షోరూమ్ లల్లో బ్యాక్టీరియా వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ట్రయల్ రూమ్ లో బట్టలు వేసుకున్నప్పుడు ఆ వ్యక్తికి సంబంధించిన చెమట ఆ బట్టలకు అంటూకుంటుంది. అలాంటి బట్టలను మనం కొనేసి ఉతకకుండానే వేసేసుకుంటూ ఉంటాం. అలా చేయడం చాలా ప్రమాదం చాలా ఇన్ఫెక్షన్లు మనకు సోకే అవకాశాలు ఉన్నాయి. ఆన్లైన్లో ఆర్డర్ చేసినా కూడా ఉతికిన తర్వాతనే వేసుకోవడం మంచిది.
కంపెనీలు బట్టలపై రంగులు ,మృధువుగా ముడతలు రాకుండా ఉండడానికి మరకలు తొలగిపోవడానికి చాలా రకాల రసాయనాలను వాడుతుంటారు. ఇవి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఈ రసాయనం గురించి కంపెనీలు ఎక్కడ కూడా పెద్దగా ప్రచారం చేయవు. ఫార్మాల్డిహైడ్ వంటి రసాయనాలను మిక్స్ చేసే కంపెనీలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా పిల్లలు, గర్భిణీలు కొత్త బట్టలు వేసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి.