Sharwanand Wedding : తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన విలక్షణమైన నటన విభిన్నమై చిత్రాలతో ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో శర్వానంద్. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా కెరీర్ లో సక్సెస్ ఫుల్ గా ముందుకు తీసుకు వెళ్తోన్న శర్వా.. పర్సనల్ లైఫ్ లో వివాహం బంధంతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టనున్నాడు. ఈ ఏడాది జనవరిలో శర్వా తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె రక్షిత రెడ్డితో ఘనంగా నిశ్చితార్థం జరిగింది.
సాధారణంగా సెలెబ్రిటీలు డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. శర్వానంద్ కూడా ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నాడు. వీరి వెడ్డింగ్ ప్లాన్ రాజస్థాన్ లోని లీలా ప్యాలస్ లో జూన్ 2, 3 తేదీల్లో గ్రాండ్ గా ప్లాన్ చేశారట. ఆ ప్యాలస్ లో వివాహం అంటే రోజుకు రూ. 4కోట్లు చెల్లించాల్సి ఉంటుందట. అలాగే ప్రయాణ ఖర్చులతో పాటు మెహందీ సంగీత్లకు కలిపి దాదాపు రూ. 10 కోట్లు ఖర్చు చేస్తున్నాడని తెలిసింది.
దీంతో ఇప్పుడు శర్వా పెళ్లి నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారిపోయింది. శర్వానంద్ చివరిగా ఒకే ఒక జీవితంలో సినిమాలో కనిపించాడు. అంతకు ముందు వచ్చిన ఆడవాళ్లు మీకు జోహార్లు, ఒకే ఒక జీవితం సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం శర్వా డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్యతో మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ వల్లే శర్వానంద్ పెళ్లి కొంత ఆలస్యమైనట్లుగా తెలుస్తోంది.