The Legend of Garuda : మరణించిన వారి వస్తువులు వాడుతున్నారా..అయితే ఇది మీకోసమే..కుటుంబంలో మనకు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా చనిపోతే వారి జ్ఞాపకంగా వారికి సంబంధించిన వస్తువులను మనం దాచిపెట్టుకుంటూ ఉంటాం.
కొంతమంది మాత్రం చనిపోయిన వారి వస్తువులను దాహన సంస్కారాల్లోనే కాల్చి బూడిద చేసేస్తారు. అయితే చనిపోయిన వారి వస్తువులను అలా దాచి పెట్టుకోవడం మంచిదేనా? గరుడ పురాణం దీని గురించి ఏం చెప్తుందో తెలుసుకుందాం. గరుడ పురాణం ప్రకారం
చనిపోయిన వారి వస్తువులను మనం ఉపయోగించడం వల్ల చాలా అనర్ధాలు జరిగే అవకాశం ఉంది. మనకు చెడు జరుగుతుంది అని పురాణంలో ప్రస్తావించారు. పురాణం ప్రకారం.. చనిపోయిన వ్యక్తి యొక్క బంగారు ఆభరణాలను మనం వాడితే వారి ఆత్మ మనల్ని ఆవహిస్తుంది అంట.
ఆ బంగారు ఆభరణాలను నేరుగా అలా వాడకుండా వాటితో కొత్త ఆభరణాలను తయారు చేయించుకొని వాడుకోవచ్చు. అలాగే చనిపోయిన వారి బట్టలను కొందరు వాడుతుంటారు. అలా వాడడం అంటే ప్రమాదాలను కొని తెచ్చుకోవడమే అని గరుడ పురాణం చెబుతుంది. కనుక వారి బట్టలను పారవేయడం ఉత్తమం.
వాటితోపాటు వారు వాడిన చేతి గడియారాలు కూడా వాడకూడదు అంటున్నారు పండితులు. ఎందుకంటే అవి వాడితే చనిపోయిన వాళ్ళు ఊరికే మన కలలోకి వస్తారు అంట. కబాట్టి ఆ వస్తువులకు దూరంగా ఉండండి.