Tourist Places : మన రోజువారి దైనందన జీవితంలో చాలా వరకు ఉరుకుల, పరుగుల జీవితం గడుపుతూ అందరూ రోజు ఎంతో ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అలాంటివారు కాస్త మానసిక ప్రశాంతతను కోరుకుంటారు. తీరిక సమయాల్లో కొన్ని ప్రదేశాలను ఎంచుకొని టూర్ ప్లాన్ చేసుకుంటే మానసిక వత్తిడిల నుంచి బయటపడవచ్చు.
అలా మనకు సమయం దొరికినప్పుడు వెళ్లడానికి అనువైన ప్రదేశాలను ముందుగానే ఎంచుకొని పెట్టుకుంటే ప్రయాణం సులభతరం అవుతుంది. వాటిల్లో చెప్పుకోదగ్గ ప్రదేశాల్లో ముంబైకి దగ్గర్లో హిల్ స్టేషన్ లు ఉన్నాయి. ఇవి కుటుంబ సమేతంగా వెళ్లి చూడడానికి అనువైన ప్రదేశాలు.
మతేరాన్ : మహారాష్ట్ర కి దగ్గరలో ఉన్నటువంటి మతేరాన్ పర్యాటక ప్రదేశానికి అనువైనది దీనిని సందర్శించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి హిల్ స్తేషన్లో పరిశుభ్రమైన వాతావరణ దాగి ఉంది. అక్కడికి వెళితే మనసు ప్రశాంతత తో నిండిపోతుంది. అలాగే ఇక్కడ ప్రముఖంగా ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్, జిప్-లైనింగ్ వంటి అడ్వెంచర్ యాక్టివిటీలలో కూడా పాల్గొనవచ్చు.
లోనా వాలా : చెప్పుకోదగ్గ మరొక ప్రదేశాలలో ఒకటి లోనావాలా.ఈ ప్రదేశం సహజ సౌందర్యానికి చెందినటువంటి ప్రసిద్ధమైనది. వేసవికాలంలో మరియు వర్షాకాలంలో ఈ ప్రదేశం యొక్క అందాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ ఉండే జలపాతాలు, పర్వతాలు, సరస్సులు వెళ్లిన వారిని మంత్రముగ్దులను చేస్తాయి. పర్యటకులకు ఎంతో అనువైన ప్రదేశాలలో లోనావాలా కూడా ముఖ్యమైనది.
లావాసా పిక్నిక్ : లావాసా సందర్శక స్థలాలకు మంచి ప్రదేశం. ఈ ప్రదేశంలో స్థానికంగా దొరికే ఆహారం ఎంతో రుచికరంగా ఉంటుంది. రుచిలో ఈ ఆహారం ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకుంది. సంతోషంగా గడపాలనుకునే వారు ఈ లావాసాను కూడా చక్కటి ప్రదేశంగా ఎంచుకోవచ్చు.
కర్జాత్ : కర్జాత్ ను సన్నటి వర్షం పడుతున్నప్పుడు ఆస్వాదిస్తే అక్కడ అందమైన అద్భుత దృశ్యాలు మనకు కనిపిస్తాయి. ఇక్కడ హైకింగ్ కూడా మనం చేయవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి జలపాతాలు, పర్వతాలు, పచ్చని దృశ్యాలు పర్యటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. వారాంతపు సెలవులను ఆనందంగా గడపాలనుకునే వారికి ఈ కర్జాత్ చక్కటి ప్రదేశం.