Vastu Tips for Sleeping : చాలామంది పడుకునేటప్పుడు కొన్ని వస్తువులను పక్కనే పెట్టుకుని పడుకుంటారు. కానీ అది మంచి అలవాటు కాదు. కొంతమంది పుస్తకాలు ,సెల్ ఫోన్లు లాంటి వస్తువులను తల దగ్గర దిండుల కింద పెట్టుకుంటారు. ఇలాంటి వస్తువులు ప్రతికూల శక్తులకు నిలయాలు. దానివల్ల మనకు ఎన్నో సమస్యలు తలెత్తుతాయి.
కొందరికి పుస్తకం చదువుతూ నిద్రపోయే అలవాటు ఉంటుంది. మరి కొందరేమో సెల్ ఫోన్ చూస్తూ నిద్రపోతుంటారు. ఈ రెండు పనుల వల్ల చాలా సమస్యలు ఎదురవుతాయి. ఈ రెండు వస్తువులు తల దగ్గర ఉంచుకోవడం అంత సురక్షితం కాదు. మరి కొంతమంది బంగారు నగలను,కంకణాలు, చెవి పొగులు లాంటి వాటిని నిద్రపోయే సమయాల్లో దిండు కింద పెడుతుంటారు.
ఇది చాలా ప్రమాదకరం ప్రతికూల శక్తులు వీటికి తొందరగా ఆకర్షితమవుతాయి. పడుకునే ముందు తీసుకోవాల్సిన ఇంకో జాగ్రత్త, పడక గదిని ఎంత పరిశుభ్రంగా ఉంచితే,అంత మంచి జరుగుతుంది. కానీ చాలా వరకు టీ తాగిన కప్పులను, మురికి బట్టలను కూడా పడక మీదనే ఉంచుతారు.
ముఖ్యంగా ఇవి ప్రతికూల ప్రభావాలు కలిగిస్తాయి. దిండు కింద ఇలా ఏ వస్తువులు అయినా పెడితే దారిద్ర్యం మీవెంట ఉన్నట్టే. ఇంట్లో గొడవలకు దారితీస్తుంది. పడక గది ఎల్లప్పుడు శుభ్రంగా ఉంచితేనే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.