Vastu Tips : కొందరి ఇళ్లల్లోకి పక్షులు బాల్కనీలో, ఇంటి ప్రధాన ముఖద్వారం దగ్గర గూళ్ళు కట్టుకుంటూ ఉంటాయి. అసలు పక్షులు ఇంట్లోకి రావడం మంచిదేనా? కాదా? ఎలాంటి పక్షులు ఇంట్లోకి వస్తే మంచిది వాటి వల్ల కలిగే నష్టాలు ఏమైనా ఉన్నాయా..!? అయితే ఈ పక్షుల్లో రెండు రకాలు ఉన్నాయి.. కొన్ని పక్షులు శుభాన్ని మీ ఇంటికి తీసుకువస్తే, మరి కొన్ని పక్షులు అశుభాన్ని మోసుకు వస్తాయి.
మన ఇళ్లలోకి చిన్న, చిన్న పిచ్చుకలు ఎక్కువగా వచ్చి, అందమైన గూళ్ళు పెట్టుకుంటాయి. మరి ఈ పిచ్చుకలు ఇళ్లలోకి రావడం మంచిదేనా ? కాదా ? ఇప్పుడు తెలుసుకుందాం. సహజంగా ఇంట్లోకి పిచ్చుకలు వస్తే వాటిని వెల్లగొట్టకండి, వాటి గూళ్ళను చెదరగొట్టకండి. ఎందుకంటే పిచుకలు ఇంట్లోకి వస్తే చాలా మంచిది అని పండితులు చెప్తున్నారు. ఏ ఇంట్లోకి అయితే పిచ్చుకలు ప్రవేశించి గూళ్ళు పెడతాయో ఆ ఇల్లు సకల శుభాలతో విరాజిల్లుతుందని చెప్తున్నారు.
ఇంట్లోకి పిచుకలు ప్రవేశిస్తే శుభం జరుగుతుందని మన పెద్దలు కూడా చెబుతుంటారు. అంతే కాకుండా పిచుకలు ఇంట్లోకి వస్తే ఆ చల్లని లక్ష్మీ దేవి చూపు మన కుటుంబం మీద ఉన్నట్టే.. ధన లాభం మనకు మరింత పెరుగుతుంది అని అర్థం. అలాగే రెండు పిచ్చుకలు కనుక మన ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లో కళ్యాణం లేక సంతానం కలగబోతుందని సూచిక. మొత్తానికి పిచ్చుకలు మన పాలిట లక్ష్మీ దేవతలు అన్నమాట.