Ways to a Good Relationship : ఒక దాంపత్య జీవితం, లేకపోతే సహజీవనం కానీ సవ్యంగా సాగాలి అంటే కొన్ని నియమాలు తప్పకుండా పాటించాల్సిందే. నియమాలు అనేకంటే కూడా అర్థం చేసుకొని మెదలడం లోనే ఏ బంధమైనా సాఫీగా సాగుతుంది అని చెప్పవచ్చు. ఒక బంధం సాఫీగా సాగాలంటే చేయకూడని తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ముఖ్యంగా ఒక రిలేషన్ షిప్ లో అండర్ స్టాండింగ్ లోపిస్తే దాని ద్వారా వచ్చే సమస్యలు మాటల్లో చెప్పలేము. ఎందుకంటే ఏ బంధమైనా సరే అది పెళ్లి కానీ, సహజీవనం కానీ మొదట్లో బాగుంటుంది. రాను, రాను వారి మధ్యన చాలావరకు దూరం పెరుగుతుంది. అట్లాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించి జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు.
ఏ రిలేషన్ షిప్ అయినా సరే ముందుగా ఒకరి మీద ఒకరికి నమ్మకం అనేది ఉండాలి. మన భాగస్వామి గురించి ఎవరు ఏమి చెప్పినా కూడా, మన కళ్ళతో చూసేంతవరకు ఆ విషయాన్ని అసలు నమ్మకూడదు. అలాగే చెడుగా మన భాగస్వామ్య గురించి చెబితే అలాంటి మాటలు వినకూడదు.
వీటితో పాటు ముఖ్యంగా సర్దుకుపోవడం అనేకంటే కూడా, ఒకరి ఇష్టా,ఇష్టాలను గౌరవించడం నేర్చుకోవాలి. ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ నిరూపించుకోవడానికి ఇదొక మార్గం. గొడవ పడుతున్న సందర్భాలను మాటిమాటికి గుర్తుతెచ్చుకొని ఆ గొడవను పెద్దగా చేయడం కంటే, ఆ సందర్భాలను, ఆలోచనలను దూరంగా ఉంచి, గొడవకు గల తప్పులను తెలుసుకొని ఇకమీదట చేయకుండా ఇద్దరు అండర్ స్టాండింగ్ గా మెదలాలి.
ఒకవేళ జీవిత భాగస్వాముల్లో ఒకరు చేసింది తప్పు అయితే దాన్ని మాటిమాటికి వేలెత్తి చూపకూడదు. ఆ తప్పు వాళ్లు మరల తిరిగి చేయకుండా వారికి అవగాహన కల్పించడము, సమయాన్ని ఇవ్వడము లాంటివి చేయాలి. అలాంటప్పుడు ఇద్దరి మధ్యలో సఖ్యత బాగుంటుంది. అలాగే ఒకరి ఆలోచనలకు మరొకరు గౌరవం ఇవ్వాలి. ఫ్యూచర్ ప్లానింగ్స్ ఇద్దరు కలిసి చర్చించుకుని ఒక నిర్ణయానికి రావాలి. ఒకరి మీద ఒకరికి ప్రేమతో పాటు రెస్పెక్ట్ కూడా ఉంటేనే వారి జీవితం సంతోషంగా సాగుతుంది.