Why Ambulance Number is 108 : ఏదైనా యాక్సిడెంట్ అయినా, హఠాత్తుగా ఎవరైనా అనారోగ్యానికి గురైనా మనకు వెంటనే గుర్తొచ్చే నంబర్ 108. ఇలా ఫోన్ చేస్తా చాలు నిమిషాల్లో కుయ్.. కుయ్ అంటూ స్పాట్ కి వచ్చేస్తుంది అంబులెన్స్. సకాలంలో రోగులను, ప్రమాద బాధితులను హాస్పత్రితో చేర్చి ప్రాణాధాతగా నిలుస్తుంది. అయితే అంబులెన్స్ కి 108 టోల్ ఫ్రీ నంబర్ ఎందుకు పెట్టారు అనే డౌబ్ట్ మీకెప్పుడైనా వచ్చిందా.. ఆ నంబర్ వెనుక ఉన్న కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం. కానీ ఇక్కడ ఎక్కువగా హిందువులే ఉన్నారు.
భారతీయులకు 108 అనే సంఖ్య అత్యంత పవిత్రమైనది. అందుకే దేవుడికి కట్టే పూల పూలమాలలో 108 పూలు ఉండేలా చూసుకుంటారు. ధ్యానం కోసం వాడే పూసలు పొదిగిన హారంలో కూడా 108 పూసలని ఉపయోగిస్తారు. అలాగే ఏదైనా జపం చేసేటప్పుడు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసేప్పుడు 108 వచ్చేట్టు చూసుకుంటారు. భూమి చంద్రుడి సూర్యుడి వ్యాసం సరిగ్గా 108 సార్లు వస్తుంటుంది. శాస్త్రాల ప్రకారం చూసుకుంటే దేశంలో 108 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.
సాధారణంగా మనిషి చనిపోయాక ఆత్మ 108 ఘట్టాలను దాటి వెళుతుందని ముస్లింల నమ్మకం. ఉపనిషత్తులు, మర్మ స్థానాల సంఖ్య కూడా 108 కావడం విశేషం. అలాగే మనిషి డిప్రెషన్ లో ఉన్నప్పుడు వారి చూపు ఫోన్ లో ఎడమ భాగం వైపు చివరిగా వెళ్తుందట. అక్కడ 0,8 దగ్గరగా ఉంటాయి. అందుకే 108ని ఎమర్జెన్సీ నంబర్ గా ఎంపిక చేసి ఉండవచ్చని తెలుస్తోంది. మొదటి సంఖ్య అయిన 1 మేల్ ను, 0 ఫిమేల్ ను సూచిస్తాయి. 8వ సంఖ్య ఇన్ఫినిటీ, ఎటర్నిటిని సూచిస్తుందట. పై కారణాలన్నింటిని బట్టి అంబులెన్స్ కి 108 నంబర్ ను పెట్టి ఉండవచ్చు.