Rohan Roy : దేవుడా.. సుద్దపూస కుర్రాడి కోసం స్పెషల్ ఫ్లైట్, రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..
బిగ్ బాస్ తో శివన్నగా మారిన శివాజీ 90కి పైగా చిత్రాల్లో నటించారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక చిత్రాలు చేసి విజయాలు అందుకున్నారు. శివాజీ నటించిన 90s మిడిల్ క్లాస్ బయోపిక్ ఆయనకి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ఓటిటిలో దుమ్మురేపుతోంది.
ఈ వెబ్ సిరీస్ లో నటించిన ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు దక్కుతోంది. ముఖ్యంగా చిన్న పిల్లలుగా నటించిన మౌళి, రోహన్ రాయ్ పాత్రలకు ప్రశంసలు దక్కుతున్నాయి. చదువు సరిగ్గా అబ్బని సుద్దపూస కుర్రాడిగా నటించిన రోహన్ రాయ్ క్రేజ్ అయితే సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ఉంది.
తాజాగా రోహన్ రాయ్ గురించి వస్తున్న వార్తలు ఇండస్ట్రీ వర్గాలు ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి. 90s మిడిల్ క్లాస్ బయోపిక్ రోహన్ రాయ్ కి డిమాండ్ బాగా పెరిగిపోయింది. పలు చిత్రాల్లో అవకాశాలు వస్తున్నాయి. దీనితో అతడి పార్ట్ త్వరగా ఫినిష్ చేసి డేట్లు బ్యాలెన్స్ చేసేందుకు నిర్మాతలు తెగ కష్టపడుతున్నారట. రోహన్ తెలుగు కుర్రాడు. కానీ అతడి ఫ్యామిలీ సెటిల్ అయింది మాత్రం బెంగుళూరులో.
Ram Charan in Pak media : రాంచరణ్ పై పాకిస్తాన్ మీడియా అధినేత ప్రశంసలు.. ఇది కదా కిక్కంటే
దీనితో రోహన్ ని బెంగుళూరు నుంచి హైదరాబాద్ షూటింగ్ కి రప్పించేందుకు నిర్మాతలు స్పెషల్ ఫ్లైట్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఒకెత్తయితే అతడి రెమ్యునరేషన్ మరో ఎత్తు.. సాధారణంగా రోహన్ ఒక రోజుకి 3 వేల వరకు రెమ్యునరేషన్ అందుకునే వాడు. కానీ వెబ్ సిరీస్ తర్వాత ఏకంగా ఒక్క రోజుకి 35 వేలు పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. సుద్దపూస కుర్రాడి దశ తిరిగిపోయింది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.