Allu Arjun Love Story : స్నేహ రెడ్డితో ప్రేమలో ఉన్నట్లు అల్లు అర్జున్ మొదట చెప్పింది సమంతకే.. ఎందుకో తెలుసా
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అల్లు స్నేహ రెడ్డిల పెళ్లి రోజు నేడు. ఈ సెలెబ్రిటీ కపుల్ 13 వెడ్డింగ్ యానివర్సరీ సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. దీనితో సోషల్ మీడియాలో అల్లు అర్జున్, స్నేహ జంటకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 2011లో బన్నీ, స్నేహ ఒకరినొకరు ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి జరిగి 13 ఏళ్ళు గడచిపోయింది. ఇద్దరు పిల్లలు సంతానం.
అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా రాణిస్తున్నాడు. నేడు బన్నీ, స్నేహ పెళ్లి రోజు కావడంతో వారి ప్రేమకి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో బన్నీ సమంత హోస్ట్ గా చేసిన సామ్ జామ్ అనే చాట్ షోలో పాల్గొన్నాడు.
ఈ షోలో బన్నీ స్నేహతో ప్రేమ గురించి ఆసక్తికర విషయాలు రివీల్ చేశాడు. మొట్టమొదటి సారి స్నేహ రెడ్డిని అల్లు అర్జున్ ఒక నైట్ క్లబ్ పార్టీలో చూశాడట. నైట్ క్లబ్ పార్టీలో అమ్మాయిలు ఉంటే చాలా రకాలుగా అనుకుంటారు. కానీ ఆ పార్టీలో స్నేహ చాలా హుందాగా, డిగ్నిటీతో కనిపించిందట. పెద్దగా హడావిడి ఏమి చేయకుండా నార్మల్ గా కనిపించిందట.
అక్కడే తాను నాకు నచ్చేసింది అని బన్నీ తెలిపాడు. తాను స్నేహని ప్రేమిస్తున్న విషయం కేవలం ఇద్దరు వ్యక్తులకు మాత్రమే తెలుసు. అందులో సమంత ఒకరు. అసలు సమంతకి ఆ విషయం ఎందుకు చెప్పానో ఇప్పటికి అర్థం కావడం లేదు అని బన్నీ సరదాగా అన్నాడు. సమంత స్పందిస్తూ.. అవును.. ఆరోజు అల్లు అర్జున్ చాలా టెన్షన్ పడుతూ కనిపించాడు. ఆ అమ్మాయి ఒప్పుకుంటుందా లేదా అని కంగారు పడుతూ అడిగినట్లు సమంత గుర్తు చేసుకుంది. ఆ తర్వాత బన్నీ.. స్నేహకి తన ప్రేమ గురించి చెప్పడం ఆమె ఒకే చెప్పడం చక చకా జరిగిపోయాయి.