Anupama Parameswaran Remuneration : యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన చిత్రం డీజే టిల్లు. అట్లుంటది మనతోని అనేది సినిమా ట్యాగ్ లైన్. నేహాశెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను విమల్ కృష్ణ డైరెక్ట్ చేసాడు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన డీజే టిల్లు బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా తరువాత సిద్ధు జొన్నలగడ్డ పేరు డీజే టిల్లుగా మారిపోయింది. అయితే డీజే టిల్లు సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు అందరూ డీజే టిల్లు పార్ట్-2 కోసం వెయిట్ చేస్తున్నారు.
ఈమూవీలో హీరోయిన్ గా తొలుత శ్రీలీలాను అనుకున్నా.. అనుపమా పరమేశ్వరన్ ను ఫైనల్ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కాస్త డిఫికల్ట్ గా ఉంటుందట. అందుకే ఇద్దరు ముగ్గురు పోయిన తర్వాత చివరకు అనుపమ పరమేశ్వరన్ ను ఎంపిక చేశారట. మూవీలో సిద్దు జొన్నలగడ్డ తో ఎక్కువగా ముద్దు సన్నివేశాల్లో నటించిందంట. ఇక ఈ సీక్వెల్ లో నటిస్తున్నందుకు గాను అనుపమ రూ.1.25 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందట. ఈ మూవీ తర్వాత అనుపమకు మరిన్ని పెరిగే అవకాశం ఉంది.
ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ అమ్మడి యొక్క రొమాంటిక్ ఫోజ్ వైరల్ అవుతోంది. తాజాగా టిల్లు స్వ్కేర్ విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఒక్క పోస్టర్ తో మూవీపై అంచనాలను పెంచేశారు. సిద్దు, అనుపమ ముద్దు సీన్ యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. సెప్టెంబర్ 15న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. సితార ఎంటర్ట్‌టైనమెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్, శ్రీకర స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. డీజే టిల్లును మించి టిల్లు స్వ్కేర్ హిట్ అవుతుందేమో చూడాలి.