Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి, హరీష్ శంకర్ కాంబినేషన్ కి అంతా సెట్.. లేటెస్ట్ అప్డేట్ ఇదే..
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. చాలా కాలంగా చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల నిర్మించే చిత్రం గురించి వార్తలు వస్తున్నాయి కానీ ముందుకు సాగడం లేదు. తన తండ్రి హీరోగా ఓ సినిమా నిర్మించాలనేది సుస్మిత కోరిక.
ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ లో ముందడుగు పడ్డట్లు తెలుస్తోంది. గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ చాలా కాలంగా చిరంజీవితో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నారు. గతంలో ఓ సందర్భంలో హరీష్ చిరంజీవికి కథ కూడా వినిపించారట.

కానీ చిరంజీవి కొన్ని మార్పులు సూచించినట్లు తెలుస్తోంది. తాజాగా హరీష్ మార్పులన్నీ చేసి ఫైనల్ డ్రాఫ్ట్ ని చిరంజీవికి వినిపించారట. ఫైనల్ స్టోరీ నేరేషన్ కి ఇంప్రెస్ అయిన చిరు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ చిత్రాన్ని సుస్మిత కొణిదెల తో పాటు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ కూడా కలసి నిర్మించనుంది. త్వరలోనే ఈ కాంబినేషన్ పై అఫీషియల్ గా అనౌన్సమెంట్ రానున్నట్లు తెలుస్తోంది. వేగంగా ఈ చిత్రం పట్టాలెక్కించాలనే హడావిడిలో చిరంజీవి లేరు. ప్రస్తుతం చిరు ఫోకస్ మొత్తం విశ్వంభర పైనే ఉంది. కానీ హరీష్ కి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
