Devi Completes 25 years: కోడి రామకృష్ణ మాయాజాలం.. 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న ‘దేవి’.. నిజంగానే పాము కాటుకి గురై..
కోడి రామకృష్ణ అద్భుతమైన క్రియేటివిటీ నుంచి జాలువారిన చిత్రాల్లో ‘దేవి’ ఒకటి. నాగ దేవి, నాగలోకం లాంటి అంశాలతో అప్పట్లోనే కోడి రామకృష్ణ ఈ చిత్రంతో ప్రేక్షకులకు విజువల్ వండర్ అందించారు. హీరోయిన్ ప్రేమ టైటిల్ రోల్ పోషించిన ఈ చిత్రంలో భానుచందర్, వనిత విజయ్ కుమార్, షిజు, బాబు మోహన్ కీలక పాత్రల్లో నటించారు.
ఈ చిత్రం విడుదలై మార్చి 12 కి సరిగ్గా పాతికేళ్ళు పూర్తవుతోంది. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కి కూడా ఇది తొలి చిత్రమే. దేవిశ్రీ అందించిన పాటలు కూడా ఒక క్లాసిక్ అనే చెప్పాలి.
25 years for Blockbuster #Devi 🔥🔥
A supernatural phenomenon film which attracted the audience to theaters for a long time. 🙌
Directed by #KodiRamakrishna
Produced by @MSRajuOfficialA Rockstar @ThisIsDSP musical 🎶#Prema #Shiju @Actor_Mahendran #25YearsForDevi pic.twitter.com/Xr6V5BKl0J
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) March 12, 2024
ఈ చిత్రం విడుదలై పాతికేళ్ళు గడిచిన సందర్భంగా హీరోయిన్ ప్రేమ ఆసక్తికర విషయాలు గుర్తు చేసుకున్నారు. అప్పట్లో లేడి ఓరియెంటెడ్ చిత్రాలు అంటే చాలా రిస్క్. కానీ కోడి రామకృష్ణ గారు రిస్క్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆయన డెడికేషన్ అద్భుతం. నేను దేవతలాగే ఉండాలని డైలాగులపై ప్రత్యేక శ్రద్ద పెట్టారు. పర్ఫెక్ట్ గా వచ్చేవారు 50 టేకులైనా చేసేవాళ్ళం.
నాగదేవత అంశంతో తెరకెక్కించిన ఈ చిత్ర షూటింగ్ లో ఒక వ్యక్తి నిజంగానే పాముకాటుకు గురయ్యారు. ఎంత ప్రయత్నించినా ఆయన్ని రక్షించుకోలేకపోయాం. ఆ బాధతో రెండురోజుల పాటు షూటింగ్ కూడా సాగలేదు. క్లైమాక్స్ లో మంచులో షూటింగ్ చేయడం అతి పెద్ద సవాల్. వ్యయప్రయాసలు కూర్చి షూటింగ్ పూర్తి చేశాం. కానీ ఇంత పెద్ద విజయం సాధిస్తుందని అసలు ఊహించలేదు అని హీరోయిన్ ప్రేమ గుర్తు చేసుకుంది.
