Dune Part 2 : మహేష్ బాబు మూవీ ఇక్కడ అట్టర్ ఫ్లాప్.. అదే కథ హాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్
అప్పుడప్పుడూ ఇండియన్ ఫిలిం మేకర్స్ హాలీవుడ్ చిత్రాలని కాపీ చేస్తుంటారు. ఆమేరకు కొన్ని వివాదాలు కూడా జరుగుతుంటాయి. ఇండియన్ సినిమాలని హాలీవుడ్ వాళ్ళు కాపీ చేయడం చాలా అరుదు. తాజాగా అలాంటిదే జరిగింది. అయితే దీనిని పూర్తిగా కాపీ అని బ్లేమ్ చేయలేం. మక్కికి మక్కీ కాకపోయినా దాదాపుగా మహేష్ బాబు సినిమాని పోలిన కథతో హాలీవుడ్ లో ఒక చిత్రం వచ్చింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన ఖలేజా చిత్రం ఇప్పటికి చాలా మంది అభిమానులకు ఇష్టం. కానీ ఆ చిత్రం రిలీజైన టైం లో దారుణమైన పరాజయానికి గురైంది. మహేష్ బాబు దేవుడంటూ ప్రజెంట్ చేయడం.. కానీ సిల్లీగా కామెడీని హైలైట్ చేయడంతో ఆ చిత్రం నిరాశపరిచింది. కానీ ఇప్పటికి ఆ చిత్రాన్ని యూట్యూబ్ లో, టీవీల్లో రిపీట్ గా చూస్తుంటారు.

దాదాపు ఖలేజాని పోలిన కథతోనే హాలీవుడ్ లో రీసెంట్ గా డ్యూన్ 2 చిత్రం విడుదలయింది. తీమోతి చలమేట్ ఈ చిత్రంలో హీరోగా నటించారు. అసలు ఈ చిత్ర కథ ఏంటో ఒకసారి పరిశీలిస్తే.. తండ్రిని కోల్పోయిన హీరో పాల్ అట్రియాడిస్ (తీమోతి ) తన తల్లితో కలసి అకీరాస్ అనే గ్రహానికి వెళతాడు.
ఆ గ్రహంలో ఫ్రెమేగ్ అనే తెగ ప్రజలు ఉంటారు. వాళ్ళకి ఒక ఆపద ఉంటుంది. తమని ఆ ఆపద నుంచి రక్షించే రక్షకుడి కోసం వాళ్లంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటారు. పాల్ తల్లి ఆ రక్షకుడు తన కొడుకే అని ఆ ప్రజలకు ధైర్యం చెబుతుంది. కానీ పాల్ కి ఇందంతా పెద్దగా ఆసక్తి ఉండదు. ఫ్రెమేగ్ తెగ ప్రజలని తనవాళ్లుగా భావించడానికి ఇష్టపడడు. తన పని తాను చేసుకుంటుంటాడు.
మరోవైపు విలన్ తన ఆర్మీతో ఫ్రెమేగ్ తెగ ప్రజలని అంతం చేసేందుకు పొంచి ఉంటాడు. ఆ గ్రహంలో ఒక విలువైన డ్రగ్ ఉంటుంది. ఈ ప్రజలని అంతం చేసి ఆ డ్రగ్ ని సొంతం చేసుకోవాలనేది విలన్ ప్లాన్. మార్చి 1 విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం దుమ్ములేపుతోంది. ఈ మూవీ చూసిన తెలుగు వారంతా దాదాపుగా ఖలేజా లాగే ఉందని అంటున్నారు. ఖలేజా చిత్రంలో కూడా ఒక ఊరి ప్రజలని అంతం చేసి అక్కడ ఉండే విలువైన ఖనిజాన్ని పొందాలని విలన్ ప్రయత్నిస్తాడు. కానీ మొదట్లో ఆ ఊరి ప్రజలని ఆదుకునేందుకు హీరో ఆసక్తి చూపడు. ఇలాంటి అంశాలే డ్యూన్ 2లో ఉన్నాయి.
కానీ డ్యూన్ 2 లో గ్రాండ్ విజువల్స్, వార్ సన్నివేశాలు అబ్బురపరిచేలా ఉంటాయి. క్లైమాక్స్ ఎమోషన్స్ తారా స్థాయికి చేరుకుంటాయి. ఈఅంశాలు ఈ చిత్రానికి బాగా వర్కౌట్ అయ్యాయి. కథ ఎలా ఉన్నా దానిని ప్రజెంట్ చేసే విధానం ప్రేక్షకులని ఆకట్టుకుంటుందని మరోసారి డ్యూన్ 2 తో తేలిపోయింది.