Suman : శోభన్ బాబు కుమార్తెపై సుమన్ ఊహించని వ్యాఖ్యలు.. కోరుకున్న అమ్మాయి తనతో అలా చేయడానికి రెడీగా ఉండేదట
శోభన్ బాబు తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక లెజెండ్. హీరోల్లో అందగాడు అనే పదానికి ఆయన అక్షరాలా సరిపోతారు. అలాంటి శోభన్ బాబుతో సీనియర్ నటుడు సుమన్ తనకు ఉన్న అనుబంధాన్ని వివరించారు. ఆయన కుమార్తె గురించి శోభన్ బాబు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. గతంలో సుమన్ ఒక కేసులో జైలు శిక్ష అనుభవించిన సంగతి తెలిసిందే.
ఆ కేసు గురించి సుమన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన క్యారెక్టర్ ఎలాంటిదో వివరించారు. ఈ క్రమంలో శోభన్ బాబు కుమార్తెతో ఉన్న పరిచయాన్ని తెలుపుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. నాపై కేసులు పెట్టింది చాలా బలవంతులు. అప్పుడు నేను తమిళంలో అంత పాపులర్ కాదు.. కానీ తెలుగులో నా రేంజ్ వేరుగా ఉండేది. నా రేంజ్ తమిళ మీడియాకి అంతగా తెలియదు. కానీ ఆ సమయంలో తెలుగు మీడియా నాకు చాలా సపోర్ట్ ఇచ్చింది.
అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్, డిజిపి, లిక్కర్ కాంట్రాక్టర్ ముగ్గురూ కలసి సుమన్ పై కేసు పెట్టినట్లు చాలా మంది సన్నిహితులు చెబుతుంటారు. కానీ బయట పుకార్లు మాత్రం చిరంజీవి వల్ల అన్నట్లుగా వ్యాపించాయి. తనపై కేసు పెట్టిన వారు చాలా బలవంతులు అయినప్పటికీ నాపై గౌరవంతో సుహాసిని, సుమలత, భానుప్రియ బహిరంగంగా మద్దతు తెలిపారు. సుమన్ చాలా మంచి వాడు, మహిళలకు గౌరవం ఇచ్చే వ్యక్తి. ఎవరో కావాలనే కుట్ర చేశారు అని కుముదం అనే తమిళ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో చెప్పారు. అది తనకి చాలా బలాన్ని ఇచ్చినట్లు సుమన్ పేర్కొన్నారు.
అదే విధంగా తెలుగు మీడియా సపోర్ట్ కూడా మరచిపోలేను. సుమన్ మహిళల్లో ఉండే ఆదరణ ఒకెత్తయితే.. లేడీస్ పడిచచ్చే అందగాడు అతడు. సుమన్ కోరుకుంటే పడుకోవడానికి ఎవరైనా సిద్ధంగా ఉంటారు. ఇలా చేయాల్సిన అవసరం అతడికి లేదు అంటూ అప్పట్లో తెలుగు మీడియా తనకి సపోర్ట్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
తాను తప్పు చేసే ఉద్దేశం ఉన్నవ్యక్తిని అయితే చాలా మార్గాలు ఉన్నాయని సుమన్ అన్నారు. చాలా మందితో ఉన్న పరిచయాల్ని తాను అడ్వాంటేజ్ తీసుకోలేదని సుమన్ అన్నారు. శోభన్ బాబు కుమార్తె నాకు బాగా తెలుసు. ఆమె మా అమ్మదగ్గరకి స్పెషల్ క్లాసుల కోసం వచ్చేది. ఆమెతో అంత చనువు ఉన్నప్పటికి దానిని శోభన్ బాబు దగ్గర ఎప్పుడూ ప్రదర్శించలేదు. ఎల్లప్పుడూ శోభన్ బాబుని ఒక లెజెండ్ గానే భావించాను. ఆయన చెప్పిన ఎన్నో జీవిత పాఠాలు నేర్చుకున్నా అని సుమన్ అన్నారు. అదే విధిగమా సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె కూడా తనకి తెలుసు అని సుమన్ అన్నారు.