Game Changer : RRR బ్లాక్ బస్టర్ తర్వాత గ్లోబల్ స్టార్ అయిపోయిన మెగా పవర్ స్టార్ రామ్. ప్రెసెంట్ ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో భారీ చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కి కొంత గ్యాప్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రంలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో ఎస్ జె సూర్య విలన్ గా నటిస్తోండగా.. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. డైరెక్టర్ శంకర్ తన ప్రతి మూవీలో సామాజిక అంశాలను కూడా ప్రస్తావిస్తాడు గేమ్ ఛేంజర్ లో కూడా తన స్టైల్ కి తగ్గట్టే ప్లాన్ చేసాడు.
అయితే ఈ మూవీని ఓ కొత్త భయం మెగా ఫ్యాన్స్ ని వెంటాడుతోంది. ఈ మధ్యన మన హీరోలు తమిళ దర్శకులతో వరుస సినిమాలు చేస్తున్నారు. తెలుగు, తమిళ మార్కెట్ మీద దృష్టి పెట్టి అలా తమిళ దర్శకులతో సినిమాలు చేస్తుండగా అది వర్క్ అవుట్ అవ్వట్లేదు. రామ్ ‘ది వారియర్’ నుంచి తాజాగా వెంకట్ ప్రభు డైరెక్షన్ లో వచ్చిన నాగ చైతన్య కస్టడీ వరకు అన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇక ఈ లైన్ లో నెక్స్ట్ రామ్ చరణ్ ఉన్నాడు.
ఈ సినిమా అంచనాలను తగినట్టు ఉంటుందా లేదా అన్నది మెగా ఫ్యాన్స్ ని కంగారు పడుతుంది. గేమ్ ఛేంజర్ సినిమా నిర్మాత దిల్ రాజు కాబట్టి కాస్త ఊరట కలిగించే విషయం. మరోవైపు చరణ్ RRR తర్వాత ఆచార్య నిరాశపరచినా శంకర్ గేమ్ ఛేంజర్ తో తన సత్తా చాటాలని చూస్తున్నాడు. అయితే తమిళ దర్శకులతో మన వాళ్ల సినిమాలు ఫ్లాప్ అవుతుండడంతో గేమ్ ఛేంజర్ విషయంలో ఏం జరుగుతుందో అని మెగా ఫ్యాన్స్ తెగ టెన్షన్ కి గురి చేస్తుంది. మరి గేమ్ ఛేంజర్ తో చరణ్ ఈ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తాడేమో చూడాలి.