Guntur Kaaram: గుంటూరు కారంపై పరుచూరి తీవ్ర వ్యాఖ్యలు.. అసలు టైటిలే కరెక్ట్ కాదు, మహేష్ కి సెట్ అయ్యే సినిమా కాదు
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం గుంటూరు కారం సంక్రాంతికి విడుదలై పర్వాలేదనిపించింది. అయితే అంచనాలని అందుకునే స్థాయిలో మాత్రం ఈ చిత్రం రాణించలేదు. కథపై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, మురళి శర్మ, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, జయరాం, జగపతి బాబు చెప్పుకుంటూ పోతే భారీ తారాగణమే ఉంది.
కానీ ఒక చిన్న పాయింట్ తో త్రివిక్రమ్ కథని నడిపించారు. ఈ చిత్రంపై సీనియర్ రచయిత పరుచూరి గోపాల కృష్ణ తాజాగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏదైనా సినిమా బాగాలేకపోతే సున్నితంగా చెప్పే పరుచూరి గుంటూరు కారం మాత్రం మహేష్ బాబుకి సెట్ అయ్యే చిత్రం కాదని తేల్చేశారు.
ఇక త్రివిక్రమ్ గత చిత్రాలతో పొల్చుంటే గుంటూరు కారం మూవీలో చాలా లోపాలు ఉన్నాయని పరుచూరి అన్నారు. హీరోతో ఒక సంతకం పెట్టించుకుని పాయింట్ ని అనేక లేయర్లుగా ఎందుకు సాగదీశారు అని పరుచూరి అన్నారు. మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్ కిస్ సరిపడే కథ కాదు ఇది.
సినిమాలో అంతర్లీనంగా మదర్ సెంటిమెంట్ ఉంది. కానీ చివర్లో తప్ప ఇంకెక్కడా ఆ సన్నివేశాలు లేవు. తల్లి సెంటిమెంట్ తో సినిమా చేయాలనుకున్నప్పుడు గుంటూరు కారం అనే టైటిల్ పెట్టి ఉండాల్సింది కాదు. సంతకం పెట్టించడం కోసం హీరోయిన్ రావడం కూడా ఎబ్బెట్టుగా ఉందని అన్నారు.
త్రివిక్రమ్, మహేష్ బాబు బ్రాండ్ కోసం థియేటర్స్ కి వచ్చిన ఆడియన్స్ కి పూర్తి స్థాయిలో సంతృప్తిని ఇవ్వని చిత్రంగా మిగిలిపోయింది అని పరుచూరి అన్నారు. చివర్లో పెట్టిన ట్విస్ట్ కూడా అంతగా అతకలేదు అని అన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు కూడా ఆయన రేంజ్ లో అనిపించలేదు అని అన్నారు.