అప్పుడు వేశ్యగా నటించిన అనుష్క, ఈసారి కంప్లీట్ రివర్స్.. క్రిష్ చిత్రానికి భలే టైటిల్ కుదిరిందే ?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రం తాత్కాలికంగా షూటింగ్ ఆగిపోవడంతో క్రిష్ మరో కొత్త ప్రాజెక్టు చూసుకున్నాడు. అనుష్క శెట్టితో క్రిష్ ఇటీవల కొత్త చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఒరిస్సాలో షూటింగ్ మొదలయింది. అనుష్క హోమ్ బ్యానర్ లాంటి యువి క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
దర్శకుడు క్రిష్ కథలు ఎప్పుడూ ఆలోచింపజేసేవిగా, వైవిధ్యంగా ఉంటాయి. కానీ సక్సెస్ రేట్ చాలా తక్కువ. అనుష్క, క్రిష్ కాంబినేషన్ లో ఆల్రెడీ ఒక చిత్రం వచ్చింది. దాదాపు 14 ఏళ్ల క్రితం క్రిష్ దర్శకత్వంలో అనుష్క వేదం అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.
వేదంలో అనుష్క వేశ్యగా ఛాలెంజింగ్ రోల్ ప్లే చేసింది. ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. మరోసారి ఈ కాంబినేషన్ సెట్ కావడంతో ఆసక్తిగా మారింది. అయితే తాజాగా ఈ చిత్ర టైటిల్ గురించి ఒక క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. ఈ చిత్రానికి ఆసక్తికర టైటిల్ ఫిక్స్ చేశారు అంటూ ప్రచారం జరుగుతోంది.
ఆ టైటిల్ ఏంటంటే ‘శీలావతి’. సాధారణంగా ఈ పేరు వినగానే చేప గుర్తుకు వస్తుంది. చేప రకాలలో శీలావతి ఒకటి. ఇది పక్కన పెడితే శీలావతి.. శీలవతి అంటే మహిళ శీలం గురించి సూచించే విధంగా ఉంటుంది. మంచి గుణవంతురాలు అని కూడా చెప్పొచ్చు.
వేదంలో వేశ్యగా అనుష్కని చూపించిన క్రిష్ ఇప్పుడు పూర్తి వ్యతిరేకంగా శీలావతిగా చూపించబోతున్నారా అనే చర్చ జరుగుతోంది. ఒక అమ్మాయి తనకి జరిగిన అన్యాయాన్ని ధైర్యంగా ఎదుర్కొనే కథ ఇది అని ఆల్రెడీ లీకులు వచ్చాయి. ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే.. అనుష్క తన క్యారెక్టర్ ని నిరూపించుకునేందుకు పోరాడుతోందా.. ఆ కోణంలోనే కథ ఉండబోతోందా అనే చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇది ఏమైనా ఇది సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే. చిత్ర యూనిట్ అధికారికంగా స్పందించాల్సి ఉంది.