‘యానిమల్’ పిచ్చ పిచ్చగా నచ్చేసింది..ఇలాంటి చిత్రాలకు నేనెప్పుడైనా రెడీ
బోల్డ్ కంటెంట్ తో అద్భుతమైన ఎమోషన్స్ రాబట్టడం తన శైలిగా మార్చుకున్నారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డి చిత్రంలో ప్రేమని హైలైట్ చేసిన సందీప్.. యానిమల్ లో తండ్రిపై కొడుకు పెంచుకున్న ప్రేమని చూపించారు. కాకపోతే చాలా బోల్డ్ అండ్ వయలెంట్ గా.
గత ఏడాది డిసెంబర్ లో రిలీజైన యానిమల్ మూవీ బాక్సాఫీస్ వద్ద 700 కోట్ల వరకు గ్రాస్ రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో హింస పట్ల కొందరు విమర్శలు చేసినప్పటికీ ఆడియన్స్ మాత్రం థియేటర్స్ కి క్యూ కట్టారు. ఇప్పటికి ఈ చిత్రంపై కొందరు సెలబ్రిటీలు విమర్శలు.. మరికొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.
తాజాగా బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ హ్యూమా క్యురేషి యానిమల్ చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓ ఇంటర్వ్యూలో హ్యూమా క్యురేషి మాట్లాడుతూ.. యానిమల్ చిత్రం నాకు పిచ్చపిచ్చగా నచ్చేసింది. హీరోని తిరుగులేని మగాడిగా చూపించిన విధానం.. యాక్షన్, మ్యూజిక్ ఇలా ప్రతి అంశం నాకు నచ్చాయి.
అన్ని రకాల చిత్రాలు రావాలి. యానిమల్ లాంటి చిత్రాలు కూడా రావాలి. ఎందుకంటే ఆడియన్స్ కి ఏ చిత్రం చూడాలో.. ఏ చిత్రం చూడకూడదో నిర్ణయించుకునే ఛాయిస్ ఉంది అని హ్యూమా క్యురేషి తెలిపింది. యానిమల్ తరహా చిత్రాల్లో నటించాలని తనకు చాలా ఆసక్తిగా ఉన్నట్లు హ్యూమా క్యురేషి పేర్కొంది. ఎందుకంటే మెషిన్ గన్స్ ఫైట్స్ అంటే ఆమెకి చాలా ఇష్టం అట. ఇలా శత్రువులపై విధ్వంసం సృష్టించే చిత్రాలని తాను ఎక్కువగా ఇష్టపడతానని పేర్కొంది. పరోక్షంగా ఆమె తాను యానిమల్ లాంటి బోల్డ్ కంటెంట్ ఉన్న చిత్రాలకు రెడీ అంటూ సంకేతాలు పంపుతోంది.