- పవన్ కళ్యాణ్ ఖుషి.. అప్పట్లో కుర్ర కారుని ఖుషీ చేసిన ఈ సినిమా రెండు దశాబ్దాల తర్వాత ఈ నెల 31 న మనల్ని మళ్లీ ఖుషీ చేయడానికి రీ రిలీజ్ అవుతుంది. అయితే ఇపుడు కొత్తగా ఈ సినిమా గొప్పతనం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అది మనందరికీ తెలిసిందే. ఇపుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే రచ్చ నడుస్తుంది.. ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళు ఏదో పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకి టికెట్స్ దొరికినంత సంతోషంగా ఈవిషయాన్ని షేర్ చేసుకుంటున్నారు.
అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయాయి. అయితే ఇప్పటికే టీవీ లో.. యూట్యూబ్ లో ఈ సినిమాని ఎన్నోసార్లు చూసినా సరే మళ్లీ థియేటర్ లో మాత్రం ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. ఎందుకు అంటే దానికి రెండు రీజన్స్ చెప్పవచ్చు..
ఒకటి.. ఇరవై ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమాని అప్పట్లో చూసిన వాళ్ళు మాక్సిమం కుర్రకారే.. ఇపుడు వాళ్ళు అంతా 35 ప్లస్ కొచ్చి కుటుంబ బాధ్యతల్లో తలమునకలై ఉన్న వాళ్లకి ఇది ఒక గొప్ప రిలీఫ్.. నిజానికి ఒక టైం ట్రావెల్ లెక్క.. మళ్లీ 20 ఏళ్ళు వెనక్కి వెళ్లి అప్పటి రోజులు గుర్తు తెచ్చుకుని బాగా ఎంజాయ్ చేయొచ్చు.. థియేటర్ లో ఉన్న మూడు గంటలూ మళ్లీ కుర్రాళ్ళు అయిపోవచ్చు.. కాసేపు టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టి గతం లోకి వెళ్లిపోవచ్చు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
రెండు.. ఇప్పటి యూత్ కోసం.. అసలు పవన్ కళ్యాణ్ అంటే ఏంటి..? అతనికి ఇంత క్రేజ్ ఏంటి..? అతని ఎనర్జీ లెవల్స్ ఏ రేంజ్ లో ఉండేవి..? అప్పట్లో కుర్రాడిగా ఉన్న పవన్ చేసిన మెస్మరైజ్ ఏంటి..? అసలు ఇప్పటి యూత్ ఫాలో అవుతున్న ట్రెండ్ ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం పవన్ క్రియేట్ చేసిన ట్రెండ్ ముందు ఎంత దిగదుడుపో తెలుసు కోవాలి అంటే ఖచ్చితంగా ఈ మూవీ ని థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే.
ఇప్పటికే ఈ సినిమాని టీవీల్లోనో మొబైల్ లోనో చూసినా సరే ఈ సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరు. అవతార్ సినిమా 3D లో చూడడానికి నార్మల్ గా చూడడానికి ఎంత తేడా ఉంటుందో ఖుషీ సినిమా ని థియేటర్ లో చూడడానికి టీవీలో చూడడానికి అంత తేడా ఉంటుంది. థియేటర్ లో అసలు మిస్ కాకండి..