Kriti Sanon Remuneration : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న మూవీ ఆదిపురుష్. కృతిసనన్ (Krithisanon) సీతగా, సైఫ్ అలీఖాన్ (Saif Alikhan) రావణాసురుడిగా, సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రలో నటిస్తున్నారు. ఓం రౌత్ (Om Raut) ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన ఆదిపురుష్ ట్రైలర్ కి, అలాగే జై శ్రీరామ్ సాంగ్ కి ఆడియన్స్ నుండి సూపర్ గా రెస్పాన్స్ వస్తుంది.
టీ సిరీస్ ఫిలిమ్స్, రిట్రో ఫైల్స్ సంస్థలు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించాయి. పాన్ ఇండియన్ రేంజ్ లో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీని పలు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈ సినిమా జూన్ 16న థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఇందులో ప్రభాస్ కు జంటగా నటించిన కృతిసనన్ రెమ్యూనరేషన్ గురించి నెట్టింట చర్చ జరుగుతుంది. కృతిసనన్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘1.. నేనొక్కడినే’
సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. ఢిల్లీలో జన్మించిన ఈ చిన్నది బాలీవుడ్ కాకుండా టాలీవుడ్ ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. అయితే కృతి సనన్ తొలిసారిగా ప్రభాస్‌తో ఆదిపురుష్ తో స్క్రీన్ షేర్ చేసుకోనుంది. ఇక ఆదిపురుష్ సినిమాకు గాను కృతి రెండు కోట్లకుపైగానే రెమ్యూనరేషన్ తీసుకుందని టాక్. వరుస ఫ్లాప్ ల తర్వాత డార్లింగ్ నుంచి వస్తున్న ఈ మూవీపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి, చూడాలి ఏం జరుగుతుందో..