Mahesh Babu Allu Arjun : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ గుంటూరు కారం. ఆది నుంచి ఈ మూవీకి అన్నీ ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఎన్నో వాయిదాల అనంతరం జనవరిలో ఈ మూవీ సారధి స్టూడియోలో భారీ సెట్ లో రెండు షెడ్యూల్స్ ని కంప్లీట్ చేసుకుంది. ఇప్పటికీ ఈ మూవీ షూట్ 10, 20% షూట్ మాత్రమే పూర్తవగా అందులో నుంచే ఏరికోరి మొన్న మే 31న గ్లిమ్స్ వదిలారు మేకర్స్.
అయితే మొదట ఈ మూవీని ఆగస్ట్ లో రిలీజ్ చేయాలి అనుకున్నారు అందుకు తగ్గట్టే షూటింగ్ లో వేగం పెంచారు. కానీ అంతలోనే ఏం జరిగిందో ఏమో వచ్చే ఏడాది సంక్రాంతి 13న విడుదల చేస్తామని ప్రకటించారు. దీంతో ఆ మధ్య షూటింగ్ కి కాస్త గ్యాప్ ఇవ్వడంతో ఇప్పుడు విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో షూటింగ్ స్టార్ట్ చేద్దాం అంటే ఆర్టిస్టుల డేట్స్ అడ్జస్ట్ అవ్వడం లేదు. చివరకు సంక్రాంతి ఈ సినిమా రావడం అనుమానంగా మారింది.
దీంతో ఫ్యాన్స్ త్రివిక్రమ్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు అల్లు అర్జున్, శ్రీలీల యాడ్ రావడం దానికి త్రివిక్రమ్ డైరెక్టర్ కావడంతో త్రివిక్రమ్ ను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ప్రారంభించారు. నీకు యాడ్ షూట్ చేయడానికి టైం ఉంటుంది కానీ మూవీ షూట్ కి టైం ఉండదా అంటూ విమర్శిస్తున్నారు. అసలు విషయం ఏంటంటే.. గుంటూరు కారం మూవీ ఆలస్యం అవడానికి త్రివిక్రమ్ కు సంబంధం లేదు.
ఆర్టిస్టుల డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడం, కొన్నిసార్లు హీరో కూడా అందుబాటులో లేకపోవడంతో లేట్ అయ్యింది. దీనికి డైరెక్టర్ త్రివిక్రమ్ కు సంబంధం లేదు, ఇంకా యాడ్ విషయానికి వస్తే.. ఆ యాడ్ గుంటూరు కారం షూటింగ్ ప్రారంభానికి ముందు గతేడాది డిసెంబర్ లో రామోజీ ఫిల్మ్ సిటీలో తీసింది. రెండు రోజుల్లోనే ఆ షూటింగ్ కంప్లీట్ చేశారు. కానీ ఆహా వాళ్ళు వారికి అది అవసరం అనుకున్నప్పుడు విడుదల చేసుకున్నారు. దీంతో అసలు విషయం తెలీకుండానే త్రివిక్రమ్ ను ఓ వర్గం గురూజీ.. గురూజీ అంటూ ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు.