Mega Family Movies : మెగా ఫ్యామిలీ గతకొంత కాలంగా ఫుల్ ఖుషీగా ఉంది. RRR కి ఆస్కార్ రావడంతో రామ్ చరణ్ అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. పవన్ కళ్యాణ్ రాజకీయంగా, సినిమాల పరంగా దూసుకుపోతున్నాడు. యాక్సిడెంట్ తర్వాత కొంతకాలం సినిమాలకు దూరమైన సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్.. ‘విరూపాక్ష’తో హిట్ కొట్టి మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఇటీవల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎంగేజ్ మెంట్ జరిగింది. తాజాగా రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కూతురు పుట్టడంతో మెగా ఫ్యామిలీ రెట్టింపు ఉత్సాహంతో ఉంది.
మరోవైపు మెగా హీరోలంతా వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు. అందులో మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాయి. అందులో మొదటిది.. జులై 28, 2023 నుంచి ఫ్యాన్స్ కు మెగా ట్రీట్ స్టార్ట్ అవుతుంది. తొలిసారిగా మామ అల్లుడు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం బ్రో. తమిళ్ మూవీ ‘వినోదయ సీతమ్’ సినిమాను తెలుగులో బ్రో ది అవతార్ గా పవన్ రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. దీనికి సముద్రఖని దర్శకత్వం వహించడంతో పాటు కీలక పాత్రలో నటించాడు.
ఈ మూవీకి మాటలు, స్క్రీన్ ప్లే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఇద్దరు మెగా హీరోలను ఒకే ఫ్రేమ్‌లో చూడాలని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఇక బ్రో విడుదలైన రెండు వారాల తర్వాత, మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్నా భోళా శంకర్ ఆగస్టు 11, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీకి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తుండగా తమన్నా హీరోయిన్ గా కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలిగా నటిస్తుంది.
భోళా శంకర్ విడుదలైన 2 వారాల తర్వాత వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గాండీవధారి అర్జున ఆగష్టు 25, 2023న థియేటర్స్ లో విడుదల కానుంది. ఏజెంట్ బ్యూటీ సాక్షివైద్య హీరోయిన్ కాగా ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. స్పై థ్రిల్లర్ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. వరుణ్ లాస్ట్ మూవీ గని ఫ్లాప్ అవ్వడంతో వరుణ్ కి ఈ మూవీ హిట్ తప్పనిసరి. మొత్తానికి మెగా ఫ్యాన్స్ నెల వ్యవధిలో మూడు మెగా మూవీస్ రిలీజ్ కానుండడంతో ఫుల్ ఖుషీగా ఉన్నారు. మరి ఈ చిత్రాలు ఎంతమేరకు మెప్పిస్తాయో చూడాలి.