Nagma-Ganguly Affair : తిరుపతిలో రహస్యంగా పెళ్లిచేసుకున్న గంగూలీ – నగ్మా! ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా క్రికెటర్లకు, సినీ తారలకు మధ్య ప్రేమ, పెళ్లి అనేవి చాలా కాలంగా మనం చూస్తున్నదే. ప్రస్తుతం బీసీసీఐ (BCCI) అధ్యక్షుడు, మాజీ టీమ్ ఇండియా (Team India) కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా అలా ఒక నటి ప్రేమలో పీకల్లోతు మునిగిపోయాడు. ఆమె ప్రముఖ నటి నగ్మ . 1999 వరల్డ్ కప్ జరిగే సమయంలో ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా గంగూలీకి నగ్మ పరిచయం అయ్యింది. మొదటి చూపులోనే ప్రేమలో పడ్డా. వయసులో ఉన్న యువతీయువకులు ప్రేమలో పడటం చాలా కామన్. అయితే గంగూలీకి అప్పటికే డోనాతో పెళ్లైంది.

తన చిన్న నాటి స్నేహితురాలు డోనాను ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. డోనాతో ప్రేమ వివాహం జరిగిన రెండేళ్లకే గంగూలీ నగ్మాతో ప్రేమాయణం మొదలు పెట్టాడు. నగ్మా-గంగూలీ ప్రేమలో ఉన్నారని మీడియాలో విస్తృతంగా వార్తలు వచ్చేవి. కానీ డోనా సెలబ్రిటీలపై వార్తలు రావడం కామనే కదా అని తన చిన్ననాటి స్నేహితుడి మీద నమ్మకం ఉంచుకుంది. దక్షిణాదిలో అప్పటికే పాపులర్ హీరోయిన్ అయిన నగ్మాతో కలసి ఒకసారి గంగూలీ రహస్యంగా తిరుపతి వెళ్లాడు. అయితే ఒక విలేకరి వారిద్దరి ఫొటో తీసి పత్రికలో ప్రచురించాడు. అంతే కాకుండా వారిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారని జాతీయ మీడియాలో ఫొటోతో సహా వార్తలు ప్రచురించారు.
దీంతో డోనా మనసు ముక్కలైపోయింది. తాను చిన్నప్పటి నుంచి నమ్మి, ప్రేమించిన స్నేహితుడు ఇలా మోసం చేస్తాడా అని తట్టుకోలేకపోయింది. వెంటనే డోనా నోర్మూసుకొని కూర్చోలేదు. గంగూలీతో తాడోపేడో తేల్చుకోవాలని భావించింది. వెంటనే డోనాను క్షమించమని వేడుకున్నాడు. ఇకపై ఇలా చేయనంటూ బతిమాలుకున్నాడు. డోనా కూడా భర్తను క్షమించి ఇకపై ఇలాంటి ఆకర్షణల్లో పడొద్దని గట్టిగానే హెచ్చరించింది. గంగూలీ, డోనా ఇద్దరూ కలసి ‘నగ్మాతో ఎలాంటి సంబంధ లేదు’ అని మీడియాలో స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ నటి నగ్మా మనసు మాత్రం ముక్కలైంది.
తనకు ఎన్నో మాటలు చెప్పి, ప్రేమ, పెళ్లి అని చెప్పిన గంగూలీ వెళ్లిపోవడంతో మనసు మొద్దుబారిపోయింది. గంగూలీని క్షమించేసి అతడికి ఇచ్చిన మాట ప్రకారం దూరంగా వెళ్లిపోయింది. నగ్మా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది. నగ్మా, గంగూలీ పెళ్లి జరిగిందో లేదో మాత్రం ఇప్పటికీ నిర్దారణ కాలేదు. అయితే ఆ రిలేషన్షిప్లో తాను చాలా బాధపడ్డానని.. అది నరకాన్ని తలపించిందని నగ్మా చెప్పుకొచ్చింది. ‘సావి’ అనే పత్రికకు నగ్మ ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బాధను అంతా చెప్పుకుంది. అది నగ్మ-గంగూలీ లవ్‌స్టోరీ.