Nani Remuneration : వైవిధ్యమైన కథల ఎంపిక, తనదైన నటనతో అభిమానులను సంపాదించికున్నాడు నేచురల్ స్టార్ నాని. శ్యామ్ సింగరాయ్ లాంటి హిట్ తరువాత నాని నుంచి ‘అంటే.. సుందరానికీ’ సినిమా వచ్చింది. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. తాజాగా నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం దసరా. దసరా బ్లాక్ బస్టర్ తో నేచురల్ స్టార్ నాని కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది.
ఎప్పటి నుంచో ఓ మాస్ ఎంటర్టైనర్ చేద్దామనుకున్న నానికి దసరాతో ఆ కోరిక తీరిపోయింది. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే కాదు నాని కెరీర్ లోనే 100 కోట్లు కొల్లగొట్టిన సినిమాగా నిలిచింది. నాని ఎట్టకేలకు తన కెరీర్ లో మొట్టమొదటి 100 కోట్ల సినిమాను టచ్ చేయడంతో ఇప్పుడు ఆయన తన రెమ్యునరేషన్ పెంచబోతున్నట్లుగా తెలుస్తోంది.
దసరా సినిమాకు 20 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్న నాని తన తదుపరి సినిమాకు రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ పెంచుతూ తన తదుపరి సినిమాకి 22 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారని తెలుస్తుంది. నాని ఒక డిమాండ్ లో వున్న నటుల్లో ఒకడు. అతని సినిమాలు టాక్ ఎలా వున్నా నిర్మాత పెట్టిన పెట్టుబడి వచ్చేస్తుందనే నమ్మకం ఇండస్ట్రీలో ఉంటుంది.