Nithiin-Vikram Kumar movie : 12 ఏళ్ళ తర్వాత ఇష్క్ కాంబినేషన్ రిపీట్.. హను మాన్ నిర్మాత భారీ బడ్జెట్ మూవీ
దాదాపు నితిన్ కి పదేళ్ల పాటు హిట్ లేని సమయంలో ఇక కెరీర్ ముగిసిందని అంతా అనుకున్నారు. కానీ ఇష్క్ చిత్రంతో నితిన్ తిరిగి పుంజుకున్నాడు. ఆ మూవీ క్రెడిట్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ దే అని చెప్పాలి. క్యూట్ రొమాంటిక్ లవ్ స్టోరీతో నితిన్ కెరీర్ నాశనం కాకుండా ఆదుకున్నది విక్రమ్ కుమారే.
2012లో ఇష్క్ చిత్రం వచ్చింది. ఇప్పుడు దాదాపు 12 ఏళ్ళ తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. హను మాన్ డైరెక్టర్ నిరంజన్ రెడ్డి ఈ కాంబినేషన్ సెట్ చేసినట్లు తెలుస్తోంది. విక్రమ్ కుమార్ నితిన్ కోసం ఈ సారి భారీ కథని రెడీ చేశారట. నితిన్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ లో నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.
ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు టాక్. నితిన్ ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తమ్ముడు చిత్రంలో నటిస్తున్నాడు. అదే విధంగా వెంకీ కుడుములు దర్శకత్వంలో రాబిన్ హుడ్ చిత్రం చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు పూర్తయిన తర్వాత నితిన్, విక్రమ్ కుమార్ మూవీ సెట్స్ పైకి వెళుతుంది.
నితిన్ కి ఇటీవల సరైన సక్సెస్ లేదు. కానీ ఇష్క్ సమయంలో ఉన్నంత దారుణమైన పొజిషన్ లో నితిన్ ఇప్పుడు లేదు. నితిన్ కి సపరేట్ గా మంచి మార్కెట్ కూడా ఉంది. ఇక విక్రమ్ కుమార్ కి కూడా రీసెంట్ గా సరైన సక్సెస్ లేదు. మనం లాంటి క్లాసిక్ బ్లాక్ బస్టర్ తర్వాత విక్రమ్ కుమార్ 24, హలొ, నాని గ్యాంగ్ లీడర్ లాంటి యావరేజ్ చిత్రాలు చేశారు.
ఆ తర్వాత నాగచైతన్యతో 2022లో చేసిన థ్యాంక్యూ మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. దీనితో ప్రస్తుతం విక్రమ్ కుమార్ కి కూడా కంబ్యాక్ అవసరం. 12ఏళ్ళ తర్వాత తన ఇష్క్ హీరోతో జతకడుతున్న విక్రమ్ కుమార్ ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.