• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Movie Articles

Nivetha pethuraj : క్రేజీ హీరోయిన్ కి సీఎం కొడుకు 50 కోట్ల గిఫ్ట్ ఇచ్చాడా.. అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తారా, నటి ఫైర్

Satya by Satya
March 6, 2024
in Movie Articles
0 0
0
Nivetha Pethuraj

Nivetha Pethuraj

Spread the love

Nivetha pethuraj : క్రేజీ హీరోయిన్ కి సీఎం కొడుకు 50 కోట్ల గిఫ్ట్ ఇచ్చాడా.. అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తారా, నటి ఫైర్

ప్రముఖ నటి నివేత పేతురాజ్ గురించి యువతకి పరిచయం అవసరం లేదు. టిక్ టిక్ టిక్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న నివేత ప్రస్తుతం తెలుగులో సైతం అవకాశాలు అందుకుంటోంది. మెంటల్ మదిలో, దాస్ కా ధమ్కీ, అల వైకుంఠపురంలో లాంటి చిత్రాల్లో నివేత తనదైన ముద్ర వేసింది. నివేతాకి ఫార్ములా వన్ రేసింగ్ పై కూడా మక్కువ ఎక్కువ. అందులో ఆమెకి ప్రావీణ్యం ఉంది. తరచుగా ఫార్ములా వన్ రేసింగ్ ఫోటోలని కూడా షేర్ చేస్తూ ఉంటుంది.

హీరోయిన్లపై చిత్ర పరిశ్రమలో రూమర్స్ వస్తూనే ఉంటాయి. అయితే చిన్న చిన్న రూమర్స్ ని చాలా మంది సెలెబ్రిటీలు పట్టించుకోరు. తమకి ఇబ్బంది కలిగించే రూమర్స్ పై మాత్రం స్పందిస్తుంటారు. తాజాగా నివేత పేతురాజ్ కి అలాంటి సమస్యే ఎదురైంది. కొన్ని అసత్య ప్రచారాల వల్ల ఆమె తీవ్ర వేదన అనుభవిస్తోంది. తన క్యారెక్టర్ పై మచ్చ పడేలా ఫేక్ న్యూస్ వైరల్ అవుతుండడంతో నివేత స్పందించింది.

ఇంతకీ ఆ ఫేక్ న్యూస్ ఏంటంటే.. తమిళనాడు సీఎం తనయుడు ఉదయనిధి స్టాలిన్ కి, నివేత పేతురాజ్ కి మధ్య ఏదో జరుగుతోంది అంటూ రూమర్స్ వైరల్ అయ్యాయి. ఇటీవల ఓ తమిళ యూట్యూబ్ ఛానల్ లో  ఉదయనిధి స్టాలిన్.. నివేత పేతురాజ్ కి రూ 50 కోట్ల విలువైన ఫ్లాట్ గిఫ్ట్ గా ఇచ్చాడని వైరల్ అయింది. దీనితో వీళ్లిద్దరి మధ్య ఏదో జరుగుతోంది అంటూ రూమర్స్ వ్యాపించాయి.

ఈ రూమర్స్ వల్ల తీవ్రంగా కలత చెందిన నివేత పేతురాజ్ సోషల్ మీడియా వేదికగా ఖండించింది. సుదీర్ఘ వివరణ ఇచ్చింది. మానవత్వం లేకుండా అసత్యాలని ప్రచారం చేసి ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తారా అంటూ ప్రశ్నించింది. దుబాయ్ లో లగ్జరీ హౌస్ అంటూ వస్తున్న రూమర్స్ పై వివరణ ఇస్తూ.. నేను నా ఫ్యామిలీ గత 20 ఏళ్లుగా దుబాయ్ లో ఉంటున్నాం. మాకు ఎలాంటి లగ్జరీ హౌస్ లేదు. అద్దె ఇంట్లో ఉంటున్నట్లు నివేత పేర్కొంది.

Dune Part 2 : మహేష్ బాబు మూవీ ఇక్కడ అట్టర్ ఫ్లాప్.. అదే కథ హాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్

నేను చాలా గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చాను. నేను ఎప్పుడూ డబ్బుకి ఆశపడలేదు. ఏ నిర్మాత దగ్గర అవకాశాల కోసం చేతులు చాపలేదు. ఇప్పుడు వస్తున్న రూమర్స్ వల్ల నేను నా కుటుంబం తీవ్ర ఒత్తిడిలో ఉన్నాము. దయచేసి ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రచారం చేయొద్దు అని నివేత కోరింది.


Spread the love
Tags: 50 crore giftNivetha PethurajNivetha pethuraj fake newsNivetha Pethuraj rumoursNivetha Udayanidhi relationUdhayanidhi Stalin
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.