Pawan Kalyan OG Remuneration : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ డైరెక్టర్ సుజీత్ కాంబో వస్తున్న లేటెస్ట్ మూవీ OG. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాల్లో చురుగ్గా ఉంటూనే మరోవైపు షూటింగ్ ల్లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం పవర్ స్టార్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో సాహో ఫేమ్ సుజీత్ డైరెక్ట్ చేస్తున్న మూవీ ఒకటి. దీన్ని OG అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు. ఆ మధ్య విడుదల చేసిన ఒక్క పోస్టర్‌తోనే సోషల్ మీడియా షేక్ అయింది.
పవన్‌కు సుజీత్ వీరాభిమాని కావడంతో ఈ సినిమా ఏ లెవల్లో ఉంటుందో అని ఫ్యాన్స్ భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు. ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. RRR ఫేమ్ డి.వి.వి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ కేవలం 35 రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బ్రేక్ లెస్ షూటింగ్‌తో మరో 20 రోజుల్లో పూర్తి చేయాలని చూస్తున్నారు.
ఇదిలావుండగా OG సినిమాకు పవన్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. పవన్‌కు ఈ సినిమా కోసం ఏకంగా రూ. 75 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వనున్నారని తెలుస్తుంది. ఈ లెక్కన పవన్ రోజుకి ఏకంగా రూ. 2 కోట్లకుపైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం. ఫ్యాన్స్ లో పవన్ కి ఉన్న క్రేజ్ కి ఎంతిచ్చినా తక్కువే అని కొందరు అభిప్రాయ పడగా.. ఎంతొచ్చినా పవన్ ఖర్చు చేసేది జనసేన ద్వారా జనాలకే కదా అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.