Pooja Hegde : ఆ కాళ్లను పట్టుకుని వదలనన్నవి ఎన్నో కళ్ళు.. ఆ కళ్ళుకు కావలి కాస్తయే కాటుకలా కుర్రకారు కలలు. నా ఊపిరి గాలికి ఉయ్యాలలూగుతుంటే ముంగురులు నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టూర్చవటే నిష్టూరపు విలవిలలు స్వీట్ స్మైల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ గుండె గోడలపై తన పోస్టర్ ను అంటించేస్తోంది బుట్టబొమ్మ పూజ హెగ్డే. మంచి ఎత్తు అందుకు తగిన ఆకర్షణీయమైన రూపం పూజ హెగ్డే సొంతం.
ఆమె నాజూకుదనానికి కుర్రాళ్లంతా ఫిదా అయ్యారు. తెలుగులో ‘దువ్వాడ జగన్నాథం’ చేసిన దగ్గర నుంచి కెరియర్ పరంగా ఆమె ఇంతవరకూ వెనుదిరిగి చూసుకున్నది లేదు. ఆ సినిమా నుంచి వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ ఆమె దూసుకుపోయింది. అయితే “రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య” సినిమాలను ఒప్పుకుంది. కానీ కొన్ని కారాణాల వలన ఆ సినిమాలు చాలా తక్కువ గ్యాపులో ఒకదాని తరువాత ఒకటిగా థియేటర్లకు వచ్చాయి.
ఆ సినిమాలు ఫ్లాప్ కావడం ఆమెని తీవ్రమైన నిరాశకు గురిచేశాయి. అయినా ఆమె క్రేజ్ కీ .. ప్లేస్ కి ఢోకా లేకపోవడం విశేషం. ప్రస్తుతం ఈ నెల 21న విడుదల కానున్న ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ బాలీవుడ్ మూవీపైనే పూజ ఆశలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో పూజ హెగ్డే లేటెస్ట్ పిక్స్ వదిలారు. లెమన్ ఎల్లో కలర్ డ్రెస్ లో ఆమె ఎల్లోరా శిల్పంలా మెరిసిపోతోంది. మత్తుకళ్లతో మనసులను కొల్లగొడుతోంది.