Pragya Nayan : అందంగా కనిపించడం అత్యంత కీలకం. అన్ని ఔట్ ఫిట్స్ లో కూడా అందంగా కనిపించే హీరోయిన్ కు ఉన్న పాపులారిటీని గూర్చి వేరే చెప్పనవసరం లేదు. ఆ విషయంలో ఈ అమ్మడు స్టార్ హీరోయిన్స్ తో పోటీ పడుతుంది అనడంలో సందేహం లేదు. సురాపానం, సమరం చిత్రాలతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ నయనతార పేరు కలవడం వల్లో ఏమో కానీ ప్రేక్షకులు ఆదరణ చూపిస్తున్నారు. జార్ఖండ్‌లోని గిరిదిహ్లో పుట్టిన ఈ జాణ బెంగళూరులో పెరిగింది. పిలానీలోని బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నుండి తన బ్యాచిలర్స్ అలాగే మాస్టర్స్ డిగ్రీని పొందింది.
ఈ భామకు డ్యాన్స్ చేయడం, సినిమాలు, విహారయాత్రలంటే చాలా ఇష్టమట. మోడలింగ్ చేస్తున్న క్రమంలో 2018లో వచ్చిన కన్నడ చిత్రం ‘ఎస్కేప్’లో నటించే ఛాన్స్ వచ్చింది. మోడలింగ్, నటనపై ఆసక్తితో ఈ రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టింది. అలా ప్రగ్యా తొలిసారిగా వెండితెరపై కనిపించిం ది.సినిమాలతోపాటు పలు మ్యూజిక్ వీడియోలు,షార్ట్‌ఫిల్మ్స్ లోనూ మెరిసింది. సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. చిన్న సినిమాల్లోనటిస్తూ టాలీవుడ్లో గుర్తింపు కోసం ప్రయత్ని స్తోంది.