Ram Charan 1st Remuneration : పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన చిరుత మూవీతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు రామ్ చరణ్. మొదటి సినిమాతోనే నటనతో ఆకట్టుకున్న చెర్రీ అనంతరం మగధీరతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. నటనలో తండ్రి మెగాస్టార్ వారసత్వాన్ని, సేవలో బాబాయ్ పవర్ స్టార్ వారసత్వాన్ని పునికిపుచ్చుకున్నాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. ఓవైపు సినిమాలో ఎంతగా బిజీగా ఉన్నప్పటికీ అభిమానులకు కూడా సమయాన్ని కేటాయిస్తాడు చెర్రీ.
RRR మూవీతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ లో నటిస్తున్నాడు. ఇటీవలే చరణ్ ఉపాసన దంపతులకు ఓ పాప పుట్టడంతో రెట్టింపు ఉత్సాహంలో ఉన్నాడు చెర్రీ. అయితే తాజాగా చరణ్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. చెర్రీ మొదటి సంపాదనతో ఏం చేశాడు అనేది ఆసక్తిగా మారింది.
Baby Movie : బేబిలో ఆ చెత్త డైలాగ్ రాసినందుకు క్షమించండి : డైరెక్టర్
రామ్ చరణ్ మొదటి సినిమా చిరుతతోనే ఆయనకు మొదటి సంపాదన వచ్చిందట. ఇక ఈ సినిమాకు చెర్రీ 50 లక్షల పారితోషకం అందుకున్నాడంట. దీంతో ఆయన తన మొదటి సంపాదనతో కాస్ట్లీ గిఫ్ట్ కొనాలని భావించి, లైఫ్ లో ఎప్పటికీ గుర్తుండిపోయేలా మిలబడి వాచ్ కొనుగోలు చేశాడంట. ఇక అది తన జీవితంలోనే చాలా స్పెషల్ చెప్పుకొచ్చాడు చెర్రీ. మొదటి సినిమాతోనే నటనతో చరణ్ ఇరగదీసిన విషయం తెలిసిందే.