Ram Charan Game Changer : RRR బ్లాక్ బస్టర్ తర్వాత గ్లోబల్ స్టార్ అయిపోయిన మెగా పవర్ స్టార్ రామ్. ప్రెసెంట్ ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో భారీ చిత్రంలో నటిస్తున్నాడు. RRR తర్వాత అసలే మాత్రం గ్యాప్ తీసుకోకుండా రామ్ చరణ్.. నేరుగా డైరెక్టర్ శంకర్ సెట్ లో అడుగు పెట్టాడు. RC15 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి మొన్న చరణ్ బర్త్ డే సందర్భంగా మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
అయితే మూవీ స్టార్ అయ్యి ఏడాది దాటినా గేమ్ ఛేంజర్ కథ, జోనర్ ఏమిటన్నది చిత్ర యూనిట్ రివీల్ ఇప్పటివరకు చేయలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ మూవీ నిర్మాత దిల్‌రాజు ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఓ సామాజిక సమస్య నేపథ్యంలో సాగే రివేంజ్ డ్రామాగా గేమ్ ఛేంజర్ సినిమా సాగుతుందని తెలిపాడు.
శంకర్ సినిమాల తరహాలోనే కమర్షియల్ విలువలతో పాటు అంతర్లీనంగా ఓ సోషల్ మెసేజ్ ఉంటుందని చెప్పాడు. వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ హంగులు ఈ సినిమాలో తక్కువగా ఉంటాయని దిల్‌రాజు పేర్కొన్నాడు. ఈ సినిమాలో రామ్‌చరణ్ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నట్టు సమాచారం.
అవినీతిపై పోరాడే ఐఏఎస్ ఆఫీసర్‌గా అతడు కనిపించబోతున్నట్లు తెలిసింది. ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉండగా ఈ ఏడాది డిసెంబర్‌లో లేదా వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. ఈ చిత్రంలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో ఎస్ జె సూర్య విలన్ గా నటిస్తోండగా.. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.