RaviTeja Remuneration : మాస్ మహారాజ్ రవితేజ.. ఈ పేరులో ఏదో తెలీని ఎనర్జీ ఉంటుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో కష్టపడి ఎదిగిన వారిలో రవితేజ ఒకడు. ఒకప్పుడు చిన్నాచితకా వేషాలు వేసుకుంటూ ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు మాస్ మహారాజ్.. ఆ మధ్య వరుస పరాజయాలతో ఉన్న రవితేజ ధమాకా, వాల్తేరు వీరయ్యతో బ్యాక్ టూ బ్యాక్ హిట్లు అందుకున్నాడు. తాజాగా వచ్చిన రావణాసుర యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం రవితేజ టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు.
టైగర్ నాగేశ్వరరావు మూవీని పాన్ ఇండియా లెవెల్ లో దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల కాబోతోంది. ఇదిలా ఉంటే తాజాగా రవితేజకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. తాజాగా రవితేజ తన రెమ్యూనరేషన్ ని భారీగా పెంచేసినట్టు తెలుస్తోంది. రాజా ది గ్రేట్ సినిమా వరకు 5 కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకుంటూ వస్తున్న రవితేజ ఆ సినిమా తర్వాత తన రెమ్యూనిరేషన్ ని 12 కోట్ల వరకు పెంచాడు. అయితే మెగాస్టార్ తో చేసిన వాల్తేరు వీరయ్య మూవీ కోసం 14 కోట్ల
వరకు రెమ్యూన్ రేషన్ తీసుకున్నాడు అని టాక్. ఆ తర్వాత వచ్చిన రావణాసురకి తాను కూడా నిర్మాత కావడంతో సినిమా కలెక్షన్ లో షేర్ మాత్రమే తీసుకున్నాడు. అయితే నెక్స్ట్ చేయబోయే సినిమాలకు బిజినెస్ లో 25 % కానీ లేదా 20 నుంచి 25 కోట్ల రెమ్యూనరేషన్ కానీ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నాడట. రవితేజ మూవీకి ప్లాప్ టాక్ వచ్చిన కూడా 10 నుంచి 20 కోట్ల వరకు కలెక్షన్ లు వస్తాయి. అందువల్ల ప్రొడ్యూసర్స్ కూడా రెమ్యూనరేషన్ విషయంలో పాజిటివ్ గానే ఉన్నారు అని తెలుస్తుంది.