Samantha : అంబానీ పెళ్లి వేడుకలో రాంచరణ్, ఉపాసన.. సమంత ఎలాంటి కామెంట్ చేసిందో చూశారా..
అంబానీ ఇంట పెళ్లి సంబరాలు జరుగుతున్నాయి. ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుక ప్రపంచం మొత్తం చెప్పుకునేలా అంగరంగ వైభవంగా జరుగుతోంది. రాధికా మర్చెంట్ తో అనంత్ అంబానీ వివాహ వేడుక జరుగుతోంది. ఈ జంట పెళ్ళికి ప్రపంచం నలువైపుల నుంచి అతిథులు హాజరవుతున్నారు. ప్రపంచం మొత్తం ఉన్న సినీ తారలు, వ్యాపార వేత్తలు, క్రీడాకారులు, రాజకీయ నాయకులు ఇలా అన్ని రంగాల వారు అనంత్ అంబానీ పెళ్లికి హాజరవుతున్నారు.
టాలీవుడ్ నుంచి మెగా పవర్ స్టార్ రాంచరణ్,, ఉపాసన దంపతులు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ లో రాంచరణ్ బాలీవుడ్ ఖాన్ త్రయం షారుఖ్, అమీర్, సల్మాన్ లతో కలసి నాటు నాటు స్టెప్పులు వేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియో ఇండియా మొత్తం ట్రెండ్ అయింది. ఇప్పుడు రాంచరణ్, ఉపాసన అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో మెరుపులు మెరిపించారు.
రాంచరణ్, ఉపాసన ఇద్దరూ అద్భుతమైన డ్రెస్సుల్లో అదరగొడుతున్నారు. చూడగానే ఆకర్షించేలా చరణ్, ఉపాసన జంట ఇస్తున్న ఫోజులు వైరల్ అవుతున్నాయి. చరణ్, ఉపాసన ఫోజులపై సమంత ఇంస్టాగ్రామ్ స్టోరీలో కామెంట్ చేసింది. చరణ్, ఉపాసన జంటపై సమంత ‘ది క్లాసియెస్ట్’ అని కామెంట్ పెట్టింది. దీనితో ఉపాసన థాంక్యూ అని రిప్లై ఇచ్చింది. వీళ్లిద్దరి సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమంత, రాంచరణ్ కలసి రంగస్థలం చిత్రంలో నటించారు. రంగస్థలం రాంచరణ్ కెరీర్ లో మెమొరబుల్ మూవీగా నిలిచిపోయింది.