Samantha Divorce : నాగ చైతన్యతో విడాకుల వల్లే అంత జరిగిందా.. మరోసారి గుర్తుచేసుకున్న సమంత
టాలీవుడ్ లో టాప్ స్టార్ గా దూసుకుపోతున్న టైంలో సమంత.. అక్కినేని నాగ చైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే వీరిద్దరి వివాహ బంధం ఎక్కువరోజులు కొనసాగలేదు. 2017లో వివాహ బంధంతో ఒక్కటైన ఈజంట.. 2021లో విడిపోయారు. నాగ చైతన్యతో విడాకులు తీసుకోవడంతో సమంతపై చాలా ట్రోలింగ్ జరిగింది.
అనేక నిందలని కూడా సమంత భరించింది. అయితే ఆ తర్వాత సమంత నెమ్మదిగా దాని నుంచి బయట పడింది. కానీ మయో సైటిస్ అనే అంతుచిక్కని అనారోగ్య సమస్యతో సమంత తీవ్రంగా బాధపడింది. గత ఏడాది ,మొత్తం సమంత మయోసైటిస్ చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. సమంత గత ఏడాది ఖుషి చిత్రంలో మాత్రమే నటించింది.
అయితే విడాకులు, మాయో సైటిస్ కారణంగా తాను ఎంత వేదన అనుభవించింది అనే విషయాన్ని సమంత మరోసారి గుర్తు చేసుకుంది. ఓ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ అణా అనారోగ్య సమస్యలకు విడాకులే కారణం అన్నట్లుగా తెలిపింది. తాను ఫుడ్, హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటానని సమంత తెలిపింది. కానీ మయోసైటిస్ సోకిందని పేర్కొంది.
Samantha : సమంత డ్రెస్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
Samantha Divorce : విడాకుల వల్ల తీవ్ర మానసిక ఒత్తిడి..
మయోసైటిస్ కి ముందు తాను జీవితంలో చాలా క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొన్నట్లు పేర్కొంది. పరోక్షంగా విడాకుల వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు సమంత గుర్తు చేసుకుంది. దీనితో మరోసారి సమంత, నాగ చైతన్య విడాకుల విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సమంత ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తో నేషనల్ వైడ్ గుర్తింపు సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆమె పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. మరోవైపు నాగ చైతన్య తండేల్ చిత్రంతో పాన్ ఇండియా మార్కెట్ పై కన్నేశాడు.