Samantha Latest : నాగ చైతన్య హీరోయిన్ పై సమంత ఊహించని కామెంట్స్.. కళ్ళు తిప్పుకోలేకపోయిందట
స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం మయోసైటిస్ నుంచి కోలుకుంటోంది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత లైఫ్ లో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది. మయోసైటిస్ వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంది. అనారోగ్యం కారణంగా సమంత గత ఏడాది ఎక్కువగా సినిమాలు చేయలేకపోయింది. సమంత నుంచి గత ఏడాది శాకుంతలం, ఖుషి చిత్రాలు వచ్చాయి.
ఈ ఏడాది సమంత కొత్త ప్రాజెక్ట్స్ కి సైన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే సాధారణంగా స్టార్స్ హీరోయిన్లు, హీరోలు.. ఇతర నటీనటుల్ని ప్రశంసించడం చాలా అరుదు. తాజాగా సమంత ఓ ఇంటర్వ్యూలో మరో స్టార్ హీరోయిన్ పై ప్రశంసలు కురిపించింది. ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాలేదు.. సాయి పల్లవి.
నాగ చైతన్యతో సాయి పల్లవి ఆల్రెడీ లవ్ స్టోరీ చిత్రంలో నటించింది. ప్రస్తుతం నాగ చైతన్యతోనే సాయి పల్లవి తండేల్ చిత్రంలో నటిస్తోంది. అయితే తాజాగా సమంత ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవిని ఉద్దేశించి కామెంట్స్ చేయడం ఆసక్తిగా మారింది.
సాయి పల్లవి డాన్స్ అంటే తనకి చాలా ఇష్టం అని సమంత పేర్కొంది. ఆమె గొప్ప డ్యాన్సర్ అని నాకు ముందే తెలుసు. ఆమె డ్యాన్స్ పెర్ఫామెన్స్ చేసినప్పుడు నేను చూశాను. సాయి పల్లవి డ్యాన్స్ చేస్తుంటే అసలు చూపు తిప్పుకోలేం అంటూ సమంత పొగడ్తల వర్షం కురిపించింది.
సమంత, సాయి పల్లవి ఇద్దరూ అభిమానుల్లో చెరగని ముద్ర వేసిన నటీమణులు అని చెప్పొచ్చు. సమంత నటనతో పాటు గ్లామర్ పరంగా కూడా ఆకట్టుకుంటుంది. కాయాన్ని సాయి పల్లవి గ్లామర్ రోల్స్ కి దూరంగా ఉంటుంది.
Discussion about this post