Samantha : సమంతకి సింపతీ క్వీన్ అని బిరుదు పెట్టి మరీ ట్రోలింగ్.. సామ్ రియాక్షన్ ఇదే, ఏం జరిగిందంటే
సమంత రియల్ లైఫ్ లో విడాకులు, వెంటనే మయోసైటిస్ తో అనారోగ్యానికి గురికావడం ఇలా వరుస ఎదురుదెబ్బలు ఎదుర్కొంది. అయినప్పటికీ విమర్శలని ఆరోగ్య సమస్యలని తట్టుకుని నిలబడింది. సమంతకి నాగచైతన్యతో విడాకుల తర్వాత నెటిజన్లలో నెగిటివిటీ ఎక్కువైంది. ఆమె ఏం చేసినా టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.
అయితే గతంలో సమంతకి నెటిజన్లు సింపతీ క్వీన్ అనే బిరుదు పెట్టి మరీ దారుణంగా ట్రోల్ చేశారు. అసలు నెటిజన్లు సమంతకి ఎందుకు ఆ బిరుదు పెట్టారు.. దానికి సమంత ఎలా స్పందించింది అనే వివరాలు చూద్దాం.
సమంత గత ఏడాది గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం చిత్రంలో నటించింది. పౌరాణిక గాధతో తెరకెక్కిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం రిలీజ్ అయ్యే టైం లో సమంత మయోసైటిస్ కారణంగా కనీసం ప్రచారానికి కూడా హాజరు కాలేని పరిస్థితిలో ఉండింది.
కానీ ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ సమంత ఈ చిత్రం కోసం ప్రచారానికి ముందుకు వచ్చింది. శాకుంతలం ప్రచార కార్యక్రమాల్లో సమంత తన మయోసైటిస్ వ్యాధి గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. దీనితో సమంత సింపతీ కోసం ప్రయత్నిస్తోంది అంటూ సింపతీ క్వీన్ అని బిరుదు పెట్టి ట్రోల్ చేశారు.
ఆ టైం లో నేను శాకుంతలం చిత్రానికి ప్రచారం చేయకపోతే ఆ మూవీ చచ్చిపోతుంది. అందుకే మయోసైటిస్ తో బాధపడుతున్నా ప్రమోషన్స్ చేశా. కానీ అక్కడ నా వ్యాధి గురించి మాట్లాడడం వల్ల సింపతీ కోసం ప్రయత్నిస్తోంది అని అంతా అనుకున్నారు. నేను సినిమా కోసం ప్రచారం చేస్తే ఆ విషయం అర్థం కాక నన్ను ట్రోల్ చేశారు అని సమంత పేర్కొంది.