Shaakuntalam Movie : ఎపిక్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందించిన పౌరాణిక ప్రేమ కావ్యం ‘శాకుంతలం’. కాళిదాసు రచించిన అభిఙ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ప్రతి ఫ్రేమ్‌ను అత్యద్భుతంగా తెరకెక్కించే గుణ శేఖర్ మరోసారి ‘శాకుంతలం’ వంటి విజువల్ వండర్‌తో పాన్ ఇండియా ప్రేక్షకులను మెస్మరైజ్ చేయటానికి సిద్ధమవుతున్నారు. మైథాలజికల్ కథాంశంతో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వస్తున్న సినిమా శాకుంతలం.
మహాభారతంలోని ఆదిపర్వంలో శకుంతల దుష్యంతుడి ప్రేమ కథని గుణశేఖర్ వెండితెరపై దృశ్య కావ్యంగా ఆవిష్కరించారు. ఇక ఈ సినిమాకి 80 కోట్ల వరకు ఖర్చు చేసినట్లుగా తెలుస్తుంది. ఎన్నోసార్లు వాయిదా పడి ఊరిస్తున్న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఇందులోని విజువల్స్, గ్రాఫిక్స్ సాకేతికవిలువతో ఉన్నత ప్రమాణాలతో తీర్చి దిద్దబద్ద్దాయి. ఈ సినిమాను గతేడాదే విడుదల చేయాలనుకున్నా.. 3డీలోనూ తీసుకురావాలన్న ఉద్దేశంతో ఆలస్యం చేశారు.
ఇప్పుడీ శాకుంతలం 2డీ, 3డీల్‌లో విడుదల కాబోతోంది. ట్రైలర్స్ అభిమానులను ఆకట్టుకుంటోంది. శాకుంతలం నుంచి వచ్చిన పాటలు కూడా అలరిస్తున్నాయి. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. శాకుంతలం సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతోంది. విశ్వామిత్రుడి పాత్రలో మోహన్ బాబు నటించాడు.
ప్రకాశ్ రాజ్, మధుబాల, కబీర్ బేడి, సచిన్ ఖేడేకర్, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ కూతురు అర్హ తెరంగేట్రం చేస్తోంది అర్హ ‘శాకుంతలం’లో ప్రిన్స్ భరతుడిగా కనిపించనుంది. ప్యాషనేట్ ఎపిక్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ ఎపిక్ లవ్ స్టోరి ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 14న రిలీజ్ అవుతుంది.
సమంత కెరీర్ లో ఇదే తొలి పౌరాణిక సినిమా కావడం విశేషం. “శాకుంతలను కాళిదాస్ ఎలా వర్ణించారానేది నేను చదివాను. ఆ పాత్రకు ఎవరైతే బాగుంటుందనే ఆలోచన చేశా. ఫస్ట్ నేను సమంతను తీసుకోవాలని అనుకోలేదు. సమంత అయితేనే బాగుంటుందని నా కూతురు చెప్పింది. ఆ సమయంలో మరోసారి రంగస్థలం సినిమా చూశాను. ఓ పాత్రలో సమంత ఎంతగా ఒదిగిపోతుందనేది నాకు స్పష్టంగా అర్థమైంది. అప్పుడు ఆమెను సంప్రదించాను” అని చెప్పుకొచ్చారు దర్శకుడు గుణశేఖర్.
శాకుంతల అంటే స్వచ్ఛత, అమాయకత్వం, దయ, హుందాతనం. అటువంటి పాత్రను చేయడమంటే మామూలు విషయం కాదు. అంతకుముందే ది ఫ్యామిలీ మ్యాన్ 2లో రాజి వంటి బోల్డ్ పాత్రను చేశాను. అందువల్ల శాకుంతలగా సమంత ఆ పాత్రకు తగ్గ న్యాయం చేయలేనని భయపడింది గుణశేఖర్ నచ్చచెప్పడంతో శకుంతల పాత్ర యొక్క ‘క్లాసికల్’ మోడ్‌కి సరిపోయేలా ఆమె మూడు నెలల పాటుబాడీ లాంగ్వేజ్ శిక్షణ” శిక్షణ తీసుకుంది.
ఈ సినిమా కోసం సమంత చాలా కష్టమే పడింది. పురాణాలకాలం నాటి సాధారణ భంగిమలు, మనోహరమైన నడక , పౌరాణిక పాత్రలతో అనుసంధానంగా ఉండే సంజ్ఞలు, ఇతర అంశాలపై శిక్షణ తీసుకుని లేడి కన్నులు.. సివంగి నడుముతో తెరపై ప్రేక్షకులను అలరించ నున్నది. అభిజ్ఞాన శాకుంతలంలో కీలకమైన దుర్వాస మహర్షి పాత్ర మోహన్ బాబు అయితే సరిగ్గా న్యాయం చేయగలడన్న అభిప్రాయంతో మోహన్ బాబుని దర్శక, నిర్మాతలు ఎంచుకున్నట్టు తెలుస్తోంది. శాకుంతలం టీం కష్టానికి ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి అంటే 14 వరకు ఆగాల్సిందే..