Shanmukh drugs case : షణ్ముఖ్ సోదరుడు అంత నీచుడా.. పెళ్ళికి కొద్దిరోజుల ముందు మరో అమ్మాయితో, గీతూ రాయల్ కామెంట్స్
కర్మ ఎవ్వరిని విడిచిపెట్టదు అనే అనే నానుడి బిగ్ బాస్ షణ్ముఖ్ బ్రదర్స్ కి సరిగ్గా సరిపోతుందేమో. ఎందుకంటే బిగ్ బాస్ షణ్ముఖ్ ని అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళితే.. అక్కడ షణ్ముఖ్ కూడా తప్పు చేస్తూ దొరికిపోయాడు. బిగ్ బాస్ సీజన్ 5 రన్నరప్ షణ్ముఖ్ బాగా ఫేమస్ అయ్యాడు. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.
కానీ అతడు గంజాయితో పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో సాగుతోంది. వాస్తవానికి పోలీసులు అక్కడికి వెళ్ళింది షణ్ముఖ్ కోసం కాదు. షణ్ముఖ్ సోదరుడు సంపత్ ప్రేయసి అతడిపై కేసు నమోదు చేసింది. సంపత్, మౌనిక చాలా కాలంగా రిలేషన్ లో ఉన్నారు. కానీ మరికొద్ది రోజుల్లో పెళ్లి ఉంది అనగా సంపత్ ఆమెని చీట్ చేసి మరో యువతితో సంబంధం పెట్టుకున్నట్లు బిగ్ బాస్ గీతూ రాయల్ సంచలన వ్యాఖ్యలు చేసింది.
గతంలో షణ్ముఖ్, నేను బాగా మాట్లాడుకునే వాళ్ళం. అతడు బిగ్ బాస్ లో ఉన్నప్పుడు నేను చేసిన రివ్యూల వల్ల ఇద్దరికీ గ్యాప్ పెరిగింది. సంపత్ ప్రేయసి మౌనిక నాకు బాగా క్లోజ్. మౌనిక గురించి అన్ని విషయాలు నాకు తెలుసు. ఆ అమ్మాయి చాలా సెన్సిటివ్. వీళ్ళిద్దరూ చాలా ఏళ్లుగా రిలేషన్ లో ఉన్నప్పటికీ పెళ్లి ఆలస్యం అవుతూ ఉంది. విభేదాలు వచ్చినా మళ్ళీ కలసి పోయే వారు.

ఫిబ్రవరి 28న వీరి పెళ్లి ఫిక్స్ అయింది. అయితే పెళ్ళికి వారం రోజుల ముందు సంపత్ మరో అమ్మాయితో సంబంధం పెట్టుకున్నట్లు మౌనికకి తెలిసింది. తనకి కాబోయే వాడు ఎలాంటి వాడైనా అమ్మాయి భరిస్తుంది. కానీ మరొకరితో సంబంధం పెట్టుకుంటే ఏ అమ్మాయి సహించలేదు. అందుకే కేసు పెట్టింది. పోలీసులు సంపత్ కోసం వెళితే అక్కడ షణ్ముఖ్ కూడా గంజాయితో దొరికిపోయాడు.
Street Food Kumari : బిగ్ బాస్ లోకి స్ట్రీట్ ఫుడ్ కుమారి.. జాక్ పాట్ కొట్టేసినట్లే…
మౌనిక ఇది కావాలని చేసింది కాదు అంటూ గీతూ రాయల్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక వేళ నచ్చకుంటే ఇద్దరూ మాట్లాడుకుని విడిపోయి ఉండొచ్చు. కానీ సంపత్ పెళ్లి పిక్స్ అయ్యాక చీట్ చేయడం న్యాయం కాదు అని గీతూ రాయల్ పేర్కొంది.
