Shruti Haasan : నోరు జారిన శృతి హాసన్.. మీ తండ్రి తోపే, అలాగని మిగిలిన హీరోలని అంత మాట అంటావా ?
కమల్ హాసన్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారింది. శృతి హాసన్ దశ దిశ మార్చిన చిత్రం గబ్బర్ సింగ్ అనే చెప్పాలి. అప్పటి వరకు ఐరన్ లెగ్ అనే ముద్ర వేయించుకున్న శృతి.. గబ్బర్ సింగ్ చిత్రంతో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత శృతి హాసన్ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
శృతి హాసన్ తరచుగా ఏదో రకంగా వార్తల్లో ఉండడం చూస్తూనే ఉన్నాం. చివరగా శృతి హాసన్ సలార్ చిత్రంలో మెరిసింది. అయితే శృతి హాసన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యల్ని హీరోలని చులకన చేసి మాట్లాడినట్లుగా అనిపిస్తున్నాయి. తన తండ్రిని పొగిడే క్రమంలో శృతి హాసన్ నోరు జారింది.

ఆమె అభిప్రాయం ప్రకారం చాలా మంది హీరోలకు దమ్ము లేదట. కొత్తగా ప్రయత్నించడం,ప్రయోగాత్మక చిత్రాలు చేసే దమ్ము చాలా మంది హీరోలకు లేదని శృతి హాసన్ తేల్చేసింది. చాలా మంది హీరోలకు కొత్త కొత్త పాత్రలు, వైవిధ్యమైన చిత్రాలు చేయాలని ఉంటుంది. కానీ వాళ్ళు తమ కోరికని చంపుకుని మూస పాత్రలు చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి దమ్ము లేదు. అలాగే కొంతమందికి వైవిధ్యమైన పాత్రల్లో నటించే అవకాశం వచ్చి ఉండకపోవచ్చు.
కానీ మా నాన్న అలా కాదు. వీల్లద్దరికంటే మా నాన్న కమల్ హాసన్ కథల ఎంపిక చాలా కొత్తగా ఉంటుంది. ప్రతి పాత్రలో ఆయన వైవిధ్యం కోరుకుంటారు. అందుకే అయన డిఫరెంట్ అని శృతి తెలిపింది. అయితే శృతి హాసన్ వ్యాఖ్యలని కొందరు నెటిజన్లు తప్పు పడుతున్నారు. నీ తండ్రిని పొగిడే క్రమంలో ఇతర హీరోలని నిందించడం కరెక్ట్ కాదు అని అంటున్నారు. కమల్ హాసన్ వైవిధ్యమైన పత్రాలు చేయడంలో, నటనలో ఆయన తోపు. అందులో సందేహం లేదు. ఆయనలా అందరు హీరోలు చేయాలంటే కుదరదని నెటిజన్లు అంటున్నారు. ఎందుకంటే ఒక్కో హీరో నుంచి అభిమానుల అంచనాలు వేరు వేరుగా ఉంటాయి అని చెబుతున్నారు.
