SreeLeela Remuneration : మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ‘గుంటూరు కారం’. దీన్ని ఏ ముహూర్తానా అనౌన్స్ చేసారో కానీ.. ఈ సినిమా ఒక అడుగు ముందుకు వేస్తే.. మూడడుగులు వెనక్కి అన్నట్టు తయారైంది. ఈ సినిమా షూటింగ్ ఎపుడు స్టార్ట్ అవుతుందో.. ఎపుడు ప్యాకప్ చెబుతారో ఈ మూవీలో నటించే ఆర్టిస్టులకే క్లారిటీ లేదు. పైగా 2, 3 రోజులుగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్, స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. థమన్ తప్పుకోలేదు అని ఇన్ డైరెక్టుగా అయితే చెప్పారు కానీ పూజ విషయాన్ని తేల్చలేదు మేకర్స్.
దీంతో పూజ తప్పుకున్నట్టే అంతా భావిస్తున్నారు. అయితే ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ కోసం తీసుకున్న యంగ్ బ్యూటీ శ్రీలీలను మెయిన్ హీరోయిన్ గా కొనసాగించే ఉద్దేశంతో ఉన్నారట మేకర్స్. అయితే తాజాగా శ్రీలీల గుంటూరు కారం రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ కోసం శ్రీలీల 70లక్షలకు ఓకే చేసిందట. అయితే సడన్ గా మెయిన్ లీడ్ కు మార్చడంతో రెమ్యూనరేషన్ లో ఏమైనా మార్పులు ఉంటాయేమో అని అంతా భావించారు.
అందరికీ షాక్ ఇస్తూ మొదటి ఒప్పుకున్న మొత్తానికే మెయిన్ హీరోయిన్ గా చేయడానికి యంగ్ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మెయిన్ రోల్ అంటే డ్రీమ్ అలాంటిదే.. కాబట్టి వచ్చిన అవకాశాన్ని శ్రీలీల చక్కగా ఉపయోగించుకుందని చెప్పవచ్చు. ఇతర సినిమాలకు 2 కోట్లు డిమాండ్ చేస్తున్న శ్రీలీల పాత రెమ్యూనరేషన్ కే ఓకే చేయడం అనేది ఆశ్చర్యకరమైన విషయమే అయినప్పటికీ శ్రీలీల సరైన నిర్ణయం తీసుకుందనే చెప్పవచ్చు.