ముగ్గురు హీరోయిన్లతో డేటింగ్ చేశా.. ఓపెన్ గా చెప్పేస్తూ రెజీనాపై సందీప్ కిషన్ కామెంట్స్
యువ హీరో సందీప్ కిషన్ ప్రతిభ ఉన్న నటుడు. అందులో సందేహం లేదు. కానీ సందీప్ కిషన్ ఎంచుకుంటున్న చిత్రాలు అసలు వర్కౌట్ కావడం లేదు. సందీప్ కిషన్ కెరీర్ లో చెప్పుకోదగ్గ చిత్రం అంటే వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మాత్రమే. సందీప్ కిషన్ నటించిన తాజా చిత్రం ఊరు పేరు భైరవ కోన. థ్రిల్లర్ చిత్రంగా విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 16న రిలీజ్ కానుంది.
అసలే హిట్స్ లేక ఇబ్బంది పడుతున్న సందీప్ ఈ చిత్రం కోసం బాగా కష్టపడుతున్నాడు. ప్రమోషన్స్ గట్టిగా చేస్తున్నారు. చిత్ర పరిశ్రమలో లవ్ ఎఫైర్స్ కామన్. హీరోలపై హీరోయిన్లపై రూమర్స్ వస్తూనే ఉంటాయి. సందీప్ అందుకు అతీతం కాదు. అయితే సెలెబ్రిటీలు తమ పర్సనల్ లైఫ్ గురించి బయట చెప్పుకోరు. ప్రైవసీ కోరుకుంటాయారు. కానీ సందీప్ మాత్రం ఓపెన్ గా తన లవ్, బ్రేకప్, డేటింగ్ వ్యవహారాల్ని బయట పెట్టేశాడు.
ఇండస్ట్రీకి చెందిన ముగ్గురు హీరోయిన్లని చాలా సిన్సియర్ గా ప్రేమించినట్లు సందీప్ కిషన్ తెలిపాడు. అందులో ఒకరిని నాలుగేళ్లు ప్రేమించా. మరొకరిని రెండేళ్లు.. ఇంకొకరిని రెండున్నర ఏళ్ళు ప్రేమించా. వారితో రిలేషన్ లో కూడా ఉన్నా. కానీ ముగ్గురితో బ్రేకప్ జరిగింది.
బ్రేకప్ అయినప్పుడు చాలా బాధగా అనిపించింది. అయితే నా జీవితాన్ని గుర్తు చేసుకున్నప్పుడు అవి నాకు అంత ప్రాధాన్యం కాదని అనిపించింది. అయితే వాళ్లెవరు అనే విషయాన్ని ఎప్పుడూ బయటకి రానివ్వలేదు. ప్రేమ విషయం కాబట్టి నాలోనే సీక్రెట్ గా ఉంచుకున్నా. ఇక తరచుగా తన గురించి రెజీనా గురించి చాలా రూమర్స్ వస్తుంటాయి.
నేను రెజీనాతో సీక్రెట్ గా డేటింగ్ చేసినట్లు చెబుతుంటారు. అది నిజం కాదు. రెజీనా నాకు బెస్ట్ ఫ్రెండ్ అంతే. కాలేజ్ డేస్ నుంచి రెజీనా నాకు ఫ్రెండ్. నా లైఫ్ లో కష్టాలని ఆమె కూడా చూసింది. కానీ మా మధ్య ఏమీ లేదు. ఇక పెళ్లి విషయం గురించి మాట్లాడుతూ.. ఇప్పుడిప్పుడే మ్యారేజ్ పై నాకు నమ్మకం ఏర్పడుతోంది. అయితే పెళ్లి విషయం అలోచించి నిర్ణయం తీసుకోవాలి. దానికింకా టైం ఉంది అని సందీప్ తెలిపాడు.