Tamannaah Marriage : ఒకే ఫ్లాట్ లో తమన్నా, విజయ్.. ప్రేమించుకోవడానికి టైం సరిపోవట్లేదని, ఇండియాలోనే పెళ్లి..
ఇటీవల సెలెబ్రిటీ జంటలు వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కృతి కర్బందా, రకుల్ ప్రీత్ సింగ్, లావణ్య త్రిపాఠి, మీతా రఘునాథ్ ఇలా హీరోయిన్లు వరుసగా వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. చాలా కాలంగా మిల్కీ బ్యూటీ తమన్నా, నటుడు విజయ్ వర్మ ప్రేమ కథ వార్తల్లో నిలుస్తోంది. ఇద్దరూ పబ్లిక్ గానే చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారు.
అఫీషియల్ గానే తమ లవ్ స్టోరీని అనౌన్స్ చేశారు. అయితే పెళ్లి గురించి మాత్రం ఓపెన్ కావడం లేదు. తాజాగా తమన్నా విజయ్ తో పెళ్లి గురించి హింట్ ఇచ్చింది. చాలా మంది సెలెబ్రిటీలు డెస్టినేషన్ వెడ్డింగ్ పేరుతో విదేశాలలో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.
కానీ తమన్నా మాత్రం ఇండియాలోనే పెళ్లి చేసుకుంటానని తెలిపింది. అయితే పెళ్లి ఎప్పుడు జరుగుతుంది అనే విషయం మాత్రం ఇప్పుడే చెప్పలేనని తెలిపింది. అయితే ముంబై మీడియాలో తమన్నా, విజయ్ వర్మ గురించి ఆసక్తికర కథనాలు వెలువడుతున్నాయి.
తమన్నా, విజయ్ ఇండియాలోనే పెళ్లి చేసుకోవడానికి డిసైడ్ అయ్యారట. కానీ ఎక్కడనే విషయం ఇంకా నిర్ణయించుకోలేరు. మరికొన్ని రోజుల్లోనే ఆ విషయం కూడా బయటకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా తమన్నా, విజయ్ వర్మ త్వరలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు టాక్.
ప్రస్తుతం తమన్నా, విజయ్ ఒకే ఫ్లాట్ లో లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నారట. తమన్నా, విజయ్ ఇద్దరూ తమ చిత్రాలతో బిజీగా ఉన్నారు. దీనితో ప్రేమించుకోవడానికి సమయం దొరకడం లేదట. ఇద్దరూ ఒకే ఫ్లాట్ లో ఉంటే ప్రేమించుకోవడానికి సమయం దొరుకుతుంది అని ఈ నిర్ణయం తీసుకున్నారట. ఒకే ఫ్లాట్ లో సమయం దొరుకుంతుంది అదే విధంగా ఇద్దరూ తమ ప్రాజెక్ట్స్ కి ఇన్ టైం కి హాజరయ్యే ఛాన్స్ ఉంటుంది.