The Kerala Story : వివాదాల నేపథ్యంలో విడుదలైన ది కేరళ స్టోరి చిత్రం బాక్సాఫీస్ దూసుకుపోతుంది. ప్రస్తుతం రెండో వారంలో కూడా వసుళ్ల ప్రభంజనం కొనసాగిస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. చిన్న బడ్జెట్ తో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్ విడుదలతో ఈ సినిమాకు వివాదాలు చుట్టుముట్టాయి. సినిమా కాస్త రాజకీయరంగును పులుముకొని భారీ వివాదానికి తెరలేపింది. కేవలం 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ది కేరళ స్టోరీ సినిమా మొదటి
రోజే 8 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి ఆశ్చర్యపరిచింది. 8వ రోజుకు 100కోట్లకు పైగా వసూలు చేసి 200 కోట్ల దిశగా దూసుకుపోతుంది. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో ఈ సినిమా ఇంకా థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. డైరెక్టర్ సుదీప్తో సేన్ తెరకెక్కించిన ఈ సినిమాలో అదా శర్మ ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమాతో హీరోయిన్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో ఈ బ్యూటీకి ఇప్పుడు అవకాశాలు కూడా క్యూ కడుతున్నాయి.
అయితే ఇప్పుడు ది కేరళ స్టోరీ సినిమాకు అదా శర్మ తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి అందరూ చర్చించుకుంటున్నారు. దాదాపు రూ.20 కోట్ల బడ్జెట్తో ఈ మూవీను నిర్మించగా.. అదా శర్మ ఏకంగా రూ.1 కోటి పారితోషికం తీసుకుందట. ఇందులో మిగతా నటీమణులు ఒక్కొక్కరు రూ. 30 లక్షలు తీసుకున్నారట. ఇక విజయ్ కృష్ణ రూ. 25 లక్షలు, ప్రణయ్ పచౌరీ రూ. 20 లక్షలు, ప్రణవ్ మిశ్రా రూ. 15 లక్షలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది.