Tholi Prema Re Release : భారీ కటౌట్లు.. పాలాభిషేకాలు.. తీన్మార్ డ్యాన్స్‌లు.. హౌస్‌ఫుల్ బోర్డులు.. స్టార్హీరో నటించిన సినిమా విడుదలైనప్పుడు థియేటర్ల వద్ద కనిపించే వాతావరణం ఇది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్ల వద్ద ఇలాంటి పండుగ వాతావరణమే కనిపిస్తోంది. పవన్‌కల్యాణ్ (Pawan kalyan) నటించిన ‘తొలిప్రేమ’ (Tholiprema Re Release) రీ రిలీజ్‌ను పురస్కరించుకుని శుక్రవారం ఆయా థియేటర్ల వద్ద సినీ ప్రియులు సెలబ్రేషన్స్ చేశారు.
సినిమా హాళ్ల వద్ద భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి తీన్మార్ డ్యాన్స్లేశారు. ఇక థియేటర్ల లోపల కూడా ఇదే తరహా హంగామా కనిపించింది. ఓ థియేటర్లో అభిమానులు ‘సీఎం సీఎం’ అంటూ నినాదాలు చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ కెరీర్‌లోని సూపర్‌హిట్ చిత్రాల్లో ఒకటి ‘తొలిప్రేమ’ (Tholi Prema). కీర్తిరెడ్డి కథానాయిక. కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ క్లాసిక్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ విడుదలై 25 ఏళ్లు పూర్తి కావొస్తుంది. ఈ సందర్భంగా చిత్రబృందం 4K వెర్షన్లో ‘తొలిప్రేమ’ను శుక్రవారం రీ రిలీజ్ చేసింది.
తొలిప్రేమ కథ చెప్పడానికి పవన్ ఉదయం 7 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారని కారులో బయలుదేరిన కొంత సమయం తర్వాత కారు పంక్చర్ కావడంతో పవన్ ను చెప్పిన సమయానికి కలవలేదని ఆయన పేర్కొన్నారు. 8.30 గంటలకు పవన్ ను కలవడానికి వెళ్లగా పవన్ చేతిలో గన్ ఉందని ఆయన తెలిపారు. కథ నచ్చకపోతే కాల్చేయరు కదా అని చెప్పగా పవన్ నవ్వేయడంతో కోపం ఒక్కసారిగా పోయిందని కరుణాకరణ్ అన్నారు. తమిళంలో కథ చెబుతానని చెప్పినా పవన్ ఓకే చెప్పారని ఆయన చెప్పుకొచ్చారు. ప్రతి సీన్ కు స్టోరీ బోర్డ్ వేయడం నాకు అలవాటు అని కరుణాకరణ్ అన్నారు.
కథ విన్న వెంటనే సినిమా చేస్తున్నామని పవన్ చెప్పారని ఆయన తెలిపారు. ఈ మనస్సే సాంగ్ పవన్ కు ఇష్టమని ఆ సాంగ్ ఎడిటింగ్ సమయంలో రాత్రి 8 గంటలకు ఆ సాంగ్ చూపించాలని పవన్ అడిగారని కరుణాకరన్ పేర్కొన్నారు. కొంచెం వెయిట్ చెయ్యండి అని చెప్పి ఆ సాంగ్ ను ఎడిట్ చేయడానికి రాత్రి 2 అయిందని ఆయన చెప్పుకొచ్చారు. అప్పటికీ పవన్ బయట ఉండటంతో షాకయ్యానని కరుణాకరన్ పేర్కొన్నారు. ఆ సాంగ్ చూసిన తర్వాత బాగా చేశావని పవన్ కళ్యాణ్ కౌగిలించుకున్నారని కరుణాకరన్ చెప్పుకొచ్చారు.