Ustaad Bhagat Singh : జనసేనాని ఉస్తాద్ భగత్ సింగ్ కోసం ఇలా.. ఫ్యాన్స్ కి క్రేజీ అప్డేట్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ తో బిజీ బిజీగా ఉన్నారు. నేడు చిలకలూరి పేటలో ఏపీలో తొలి ఎన్డీయే సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్, ప్రధాని మోడీ, చంద్రబాబు ఒకే వేదికపైసందడి చేశారు. ఏపీలో ఎన్నికల హీట్ పెరుగుతుండడంతో పవన్ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు.
ఇంత బిజీగా అప్పటికీ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం కోసం సమయం వెచ్చించారు. అదేంటి ఉస్తాద్ షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోయింది కదా అని అనుకోవచ్చు. కానీ పవన్ సమయం వెచ్చించింది షూటింగ్ కోసం కాదు.. ఉస్తాద్ స్పెషల్ టీజర్ రెడీ అవుతోంది. దానికి డబ్బింగ్ ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ పొలిటికల్ గెటప్ లోనే వెళ్లారు.
Expect the unexpected 😎
19th March ❤️🔥❤️🔥❤️🔥#UstaadBhagatSingh pic.twitter.com/JZfYC5en6y
— Mythri Movie Makers (@MythriOfficial) March 17, 2024
డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ చేత డబ్బింగ్ చెప్పేస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. మార్చి 19న ఊహించని ట్రీట్ ఉంటుంది అంటూ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. పవర్ ఫుల్ గా ఉండే పొలిటికల్ డైలాగ్ తో టీజర్ ని కట్ చేస్తున్నారట.
ఈ టైంలో అలాంటి డైలాగ్ తో టీజర్ రిలీజ్ చేస్తే ఉస్తాద్ చిత్రానికి మంచి మైలేజి ఉంటుందని భావిస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ బిజీగా ఉండి కూడా డబ్బింగ్ చెప్పారు. గబ్బర్ సింగ్ తర్వాత పవన్, హరీష్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ఇదే. దీనితో ఈ మూవీపై సాలిడ్ బజ్ ఉంది.