Vaishnavi Chaitanya : ప్రస్తుతం టాలీవుడ్ యూత్ జపిస్తున్న మంత్రం వైష్ణవి చైతన్య. తాజాగా విడుదలైన బేబి సినిమాలో తన పర్‌ఫార్మెన్స్‌తో అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సినిమా చూసిన ప్రతీ ఒక్కరు వైష్ణవి క్యారెక్టర్‌ను బండ బూతులు తిడుతున్నారంటే.. నెగెటీవ్ క్యారెక్టర్‌లో ఏ లెవల్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. హీరోయిన్‌గా మొదటి సినిమాలోనే ఈ రేంజ్‌లో తన నటనతో వావ్ అనిపించిందని.. భవిష్యత్తులో పెద్ద స్టార్ అవుతోందని కామెంట్స్ చేస్తున్నారు. చెప్పాలంటే బేబి సినిమాకు వచ్చిన ఈ క్రేజ్ అంతా వైష్ణవి వల్లే, ఈ సినిమాను తన భుజాలపై మోసిందనే వారు లేకపోలేదు.

సోషల్ మీడియాలో వైష్ణవికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. తన పాటలతో పాటు, టిక్ టాక్ వీడియోలు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్‌తో తెలుగు రాష్ట్రాల్లో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది ఈ హైదరాబాదీ. ఇక ఆమెకు యూత్‌లో ఉన్న క్రేజ్‌ను డైరెక్టర్ సాయి రాజేష్ తెలివిగా ఉపయోగించుకున్నాడు. బేబి సినిమాతో బంపర్ హిట్ కొట్టాడని అంటున్నారు ఆమె ఫ్యాన్స్. అయితే బేబీ లో బోల్డ్ క్యారెక్టర్ చేయడానికి వైష్ణవిని ఎలా ఒప్పించారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. డైరెక్టర్ సాయి రాజేష్.. వైష్ణవి వద్దకు వెళ్లి, కథను వివరించగా..
BRO Censor Talk : పవన్ ‘బ్రో’ సెన్సార్ టాక్.. మూవీ ఎలా ఉందంటే..
“ఇంత బోల్డ్ పాత్ర నేను అస్సలు చేయనని చెప్పేసిందట.” అయినా కూడా ఈ రోల్ కి వైష్ణవే బాగా సూట్ అవుతుందని ఆయన రెండు మూడుసార్లు ఆమె చుట్టూ తిరిగి మరి ఆమెను ఒప్పించారంట. అయితే వైష్ణవి కెరీర్ మొదట్లోనే ఇలాంటి పాత్ర చేస్తే నామీద బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుందంటూ బాధపడిందట. ఒకవేళ ఈ మూవీ చేశాక నువ్వు నెగటివ్ హీరోయిన్ గా టాక్ వస్తే, నేను తర్వాత చేసే మూడు సినిమాలల్లో నీకే హీరోయిన్ గా అవకాశం ఇస్తానని అగ్రిమెంట్పై సైన్ చేయించుకున్నారట. ఆ కారణంగానే వైష్ణవి ఈ ప్రాజెక్టుకు ఓకే చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
Naga Shaurya : ఆ హీరోయిన్ తో ఎఫైర్ ఉందంటున్న నాగశౌర్య..