Varasudu movie review: సంక్రాంతి కానుకగా వచ్చిన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన లేటెస్ట్ మూవీ వారసుడు. ఈ సినిమాను తమిళంలో “వారిసు” గా తెరకెక్కించారు. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్, రష్మిక మందన్నా, ప్రకాష్‌రాజ్, శరత్‌కుమార్, జయసుధ, యోగి బాబు తదితరులు నటించారు.
Also Read : వాల్తేరు వీరయ్య రివ్యూ..
దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెలుగు నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. తమిళంలో ఇప్పటికే విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ తెలుగులో ఎలా ఉందో చూద్దాం..
కథ:
సిటీలో ఒక వ్యాపార వ్యాపారవేత్తకు పెద్ద కుటుంబం ఉంటుంది, కానీ అతని కుమారుడు విజయ్ రాజేంద్రన్ (విజయ్) వ్యాపారం గురించి పెద్దగా పట్టించుకోడు. అతను తన జీవితాన్ని కోరుకున్న విధంగా ఆనందిస్తూ ఉంటాడు. అంతా సజావుగా ఉన్నట్లు అనిపించినా వ్యాపార ప్రత్యర్థి తన తండ్రి వ్యాపారాన్ని టేకోవర్ చేయడానికి మాత్రం ఓ కన్నేసి ఉంచాడు అని తెలియడం తో విజయ్ రాజేంద్రన్ సీఈఓ గా బాధ్యతలు చేపడ్తాడు, చివరకు విజయ్ రాజేంద్రన్ అన్ని సమస్యలను ఎలా పరిష్కరిస్తాడు అనేది చిత్ర కథగా తెలుస్తుంది.
Also Read : Waltair Veerayya Twitter Review
ఏడేళ్ల పాటు కుటుంబానికి దూరంగా ఉన్న విజయ్… తన మంచితనం, కుటుంబం పట్ల ప్రేమ, బిజినెస్ తెలివితో ఎలా తనే వారసుడు అనిపించుకున్నాడు. తన అన్నలలో ఎలాంటి మార్పు తెచ్చాడు. ప్రత్యర్దిగా ఉండి కుట్ర చేస్తున్న జయప్రకాష్ కి ఎలా బుద్ది చెప్పాడు అన్నది సినిమా చూస్తే తెలుస్తుంది.
విశ్లేషణ:
వంశీ పైడిపల్లి ఊపిరి మరియు మహర్షి వంటి కొన్ని సినిమాలతో కీర్తిని పొందిన విషయం తెలిసిందే. తలపతి విజయ్‌తో ఆయనకి సినిమా చేసే అవకాశం పొందడం గొప్ప అవకాశం, కానీ అతను ఇక్కడ చేసినట్లుగా రొటీన్ మరియు పాత సబ్జెక్ట్‌తో వెళ్ళాడు. వారసుడు సినిమాను బాగా డీల్ చేసినా ఈ సినిమా చిరకాలం గుర్తుండిపోదు అని చెప్పాలి. ఓవరాల్‌గా, వారసుడు ఓల్డ్-స్కూల్ ఫ్యామిలీ డ్రామా, ఇది అందరికీ నచ్చకపోవచ్చు. ఇది పూర్తిగా దళపతి అభిమానుల కోసం రూపొందించబడింది అని చెప్పాలి.
ప్లస్ పాయింట్స్:
* వింటేజ్ విజయ్
* కామెడీ వన్ లైనర్స్
* యోగిబాబుతో వచ్చే సీన్స్
మైనస్ పాయింట్స్:
* రొటీన్ కథ
* ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే
* ఫ్యాన్స్ కు నచ్చే సీన్స్ కు ప్రయారిటీ ఇవ్వటం
రేటింగ్: 2.5
చిరవరిగా.. ఓవరాల్‌గా విజయ్ పాత సినిమాలను ఇష్ట పడేవాళ్లకు ఈ సినిమా తప్పక నచ్చుతుంది. ఇంకా ఈ రోజుల్లో ఈ పాత కథేంటిరా అనుకుంటే మాత్రం జస్ట్ ఓకే అనిపిస్తుంది.